పిరికిపందల చర్య: సభలో షిండే, అంతెత్తు లేచిన సుష్మ

వారి చికిత్సకు కావాల్సిన పూర్తి మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. పేలుళ్ల పైన తగిన ఆధారాలు సేకరించినట్లు చెప్పారు. పేలుళ్ల పైన రెండు ప్రాంతాలలో కేసు నమోదయిందన్నారు. మలక్‌పేట, సరూర్ నగర్ పోలీసు స్టేషన్‌లలో కేసు నమోదయిందన్నారు. కేసును ఎన్ఐఏ దర్యాఫ్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని షిండే సభలో ప్రకటించారు.
పేలుడు ఘటనలో 16 మంది చనిపోగా, 119 మంది గాయపడ్డారని చెప్పారు. గురువారం సాయంత్రం 6.58 నిమిషాలకు మొదటి పేలుడు, 7.01 నిమిషాలకు రెండో పేలుడు సంభవించిందన్నారు. రద్దీగా ఉండే ప్రాంతంలో పేలుళ్లు సంభవించాయన్నారు. సైకిల్‌కు బాంబులు అమర్చి పేల్చినట్లు ప్రాథమిక దర్యాఫ్తులో తేలిందన్నారు. ఘటనా స్థలిని పోలీసు, ఎన్ఐఏ బృందాలు చేరుకొని సాక్ష్యాలు సేకరించాయన్నారు. ఇది ఉగ్రవాదుల చర్య అని చెప్పారు.
పేలుళ్ల పైన ప్రకటనలు చేసి చేతులు దులిపేసుకోవడం కాదని, ఉగ్రవాద చర్యలు అరికట్టేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రతిపక్ష బిజెపి నేత సుష్మా స్వరాజ్ కేంద్రాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. షిండే ప్రకటనపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రమంత్రి ప్రకటనలో ఎలాంటి పస లేదన్నారు. ఉగ్రవాదుల దాడులు జరుగుతుందనే సమాచారం ముందే ఉంటే ఎందుకు అప్రమత్తం కాలేదని ఆమె ఘాటుగా ప్రశ్నించారు.ఘటనపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో స్పీకర్ సభను మూడున్నర గంటలకు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications