జులైలో క్రితమే రెక్కీ: తీహార్ జైల్లో ఉగ్రవాదుల విచారణ

మక్బుల్, ఆసద్, ఇమ్రాన్‌లను పోలీసులు గతంలో అరెస్టు చేశారు. ఆ సమయంలో హైదరాబాదులో రెక్కీ నిర్వహించిన విషయంపై వారు పోలీసులకు వివరాలు చెప్పినట్లు సమాచారం. హైదరాబాదులోని రద్దీగా ఉండే దిల్‌షుక్‌నగర్, బేగంబజారు, ఆబిడ్స్ ప్రాంతాల్లో వారు ముగ్గురు రెక్కీ నిర్వహించినట్లు కేంద్ర నిఘా వర్గాలు 2012 అక్టోబర్‌లో సమాచారం అందించాయి.
మక్బుల్ నాటు బాంబుల తయారీలో నిపుణడని తెలుస్తోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఉగ్రవాద ఘటనల్లో అతని పాత్ర ఉందని భావిస్తున్నారు. హైదరాబాదులోని దిల్‌షుక్‌నగర్ బాంబు పేలుళ్ల సంఘటనలో పూణేకు ఏమైనా సంబంధాలున్నాయా ఆనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పూణేలో నిరుడు ఆగస్టులో జరిగిన పేలుళ్ల ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు.
ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడైన రియాజ్ భత్కల్ సూచనల మేరకు ఇమ్రాన్ ఖాన్, సయ్యద్ మక్బూల్ అన్సారీ నిరుడు జులైలో దిల్‌షుక్‌నగర్‌లో రెక్కీ నిర్వహించినట్లు వెల్లడైంది. మక్బూల్, ఇమ్రాన్ మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందినవారు. ఏ ఉగ్రవాద సంస్థ కూడా దిల్‌షుక్‌నగర్ పేలుళ్లకు బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. దీంతో పోలీసుల పని కొంత కష్టంగానే మారింది.


Click it and Unblock the Notifications