పేలుళ్లు: సీఎంపై ఆజాద్‌కు టి ఎంపీల ఫిర్యాదు

బాంబు పేలుళ్లతో ప్రభుత్వ ప్రతిష్ట మంట కలిసిందని ఆయన అన్నారు. బాంబు పేలుళ్లపై కేంద్రం ముందే హెచ్చరించినా ఇక్కడి పోలీసులు తేలికగా తీసుకోవడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుపై, పోలీసుల వైఫల్యంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో సొంత మంత్రులు, పార్లమెంటు సభ్యులుపై ఇంటెలిజెన్స్ పని చేస్తోంది గానీ ఉగ్రవాదులపై కదలికలపై కాదని ఆయన అన్నారు. సడక్ బంద్ సందర్భంగా బెండోవర్లు, ఎంపిల అరెస్టుల కన్నా ప్రభుత్వం ప్రజల భద్రతపై దృష్టి సారించాలని ఆయన అన్నారు.
శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చిన ఆజాద్ దిల్‌షుక్‌నగర్‌లో పేలుళ్లు సంభవించిన ప్రదేశాలను సందర్శించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. లేక్‌వ్యూ అతిథి గృహంలో బస చేసిన ఆయనను పలువురు కాంగ్రెసు నేతలు కలిశారు.












Click it and Unblock the Notifications