భార్య కాపురానికి రాలేదని దాడి, బ్యాగ్‌లో శవం

కరెంట్ షాక్‌తో తల్లీకొడుకుల మృతి
కృష్ణా జిల్లాలోని మరో ఘోరం జరిగింది. జిల్లాలోని చల్లపల్లి మండలం ఒక్కగడ్డ గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై తల్లీకుమారుడు మరణించారు. కోళ్లపారంలో పనిచేస్తున్న డేగుల రమణ (45) పొరపాటున అక్కడ ఉన్న విద్యుత్ వైర్లను తాకి, విద్యుదాఘాతానికి గురైంది. ఆమె కుమారుడు శేఖర్ (22) ఆమెను రక్షించబోయి తాను కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఇరువురు కూడా సంఘటనా స్థలంలోనే మరణించారు. శేఖర్ పాలిటెక్నిక్ చదువుతున్నాడు.
పాతకక్షలతో ఇద్దరి హత్య
మహబూబ్‌నగర్ జిల్లా ధరూర్ మండలం మన్నాపురం గుట్ట సమీపంలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. పాతకక్షల కారణంగానే వీరిని ప్రత్యర్థులు హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతులు జీరబండ గ్రామానికి చెందిన నర్సింహులు (60), చింతరేవుల గ్రామానికి చెందిన బోయ లక్ష్మయ్య (45)లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు బావామరుదులని తెలుస్తోంది.
కాచిగుడా - గుంటూరు ప్యాసింజర్ రైలులో ఓ సంచీలో బాలుడి శవం బయటపడింది. ఈ ఘటన శనివారం కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తులు సంచీని రైలులో వదిలి వెళ్లారు. ఈ విషయాన్ని గుర్తించిన తోటి ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. మహబూబ్‌నగర్ రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications