కుప్పం బాధ్యత లోకేష్ చేతికి: నేతలతో రుసరుసలు

తాను మళ్లీ వారంరోజుల్లో కుప్పంలో పర్యటిస్తానని, అప్పుడు కార్యకర్తలతో తీరిగ్గా మాట్లాడతానని లోకేష్ చెప్పారు. నియోజకవర్గ స్థానిక నాయకత్వంతో మాత్రం దూరంగా ఉన్నారు. మందలింపు ధోరణిలో హెచ్చరికలూ చేశారు. డిసిఎంఎస్ ఎన్నికల విషయంలో చంద్రబాబు ఆదేశాలను ఇక్కడి నాయకులు ధిక్కరించడమే దీనికి కారణమని చెబుతున్నారు డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీ నేతలు చేతులు కలపడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ సహకారంతో వచ్చే డీసీఎంఎస్ పదవులు మనకొద్దని, ఆ ఎన్నికను బహిష్కరించాలని చంద్రబాబు ఆదేశించారు. అయినా, చంద్రబాబు ఆదేశాల్ని ధిక్కరించి కుప్పం నియోజకవర్గానికే చెందిన డైరెక్టర్లు శ్యామరాజు, వరలక్ష్మమ్మ కాంగ్రెస్ సహకారంతో డీసీఎంస్ చైర్మన్, వైఎస్ చైర్మన్ పదవులు పొందారు. దీంతో పర్యటన ఆద్యంతం లోకేష్ స్థానిక నేతలతో ఆగ్రహంతో ఉన్నారు. 'ఇక్కడ పార్టీ ఎటువెళ్తోంది. మీరింతమంది ఉండి ఏం చేస్తున్నా రు? మూడునెలల కోసారి నాన్న పర్యటిస్తున్నా, ఈ ఐక్యతా లోపమేమిటి?' అంటూ ప్రశ్నించారు.
స్థానిక నాయకుల పట్ల అసహనంగా ఉన్న ఆయన తనను పలకరించిన సామాన్యులతో మాత్రం ఆప్యాయంగా మాట్లాడారు. శాంతిపురం మండలం రాళ్లబూదుగూరులో 'నాన్నెలా ఉన్నారప్పా?' అని అడిగిన వృద్ధురాలు అడిగితే - కాళ్లనొప్పులతో ఉన్నారని, పాదయాత్ర పూర్తయిన తర్వాత మీ దగ్గరికి వస్తారని చెప్పారు. ప్రచారరథం ఎక్కి ముందుకు సాగాలని కోరిన స్థానిక నా యకులపై మాత్రం అసహనాన్ని ప్రదర్శించారు. తానొచ్చింది పెళ్లికే కానీ, పార్టీ కార్యక్రమాల కోసం కాదని మందలించారు. దీంతో స్థానిక నాయకులెవరూ ఆయన దరి చేరలేకపోయారు. మళ్లీ మార్చి నెల 7, 8, 9 తేదీల్లో ఆయన కుప్పంలో పర్యటిస్తారు.


Click it and Unblock the Notifications