పేలుళ్లు మా పనే: కిషన్‌రెడ్డికి లష్కరే బెదిరింపు లేఖ

దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుడు తమ పనేనని ఆ లేఖలో పేర్కొన్నట్లుగా ఆయన చెప్పారు. బాంబు పేలుడు తమ పనేనని, తర్వాత తమ టార్గెట్ బేగంబజార్ అని అక్కడ కూడా త్వరలో దాడి చేస్తామని లేఖలో హెచ్చరించారని కిషన్ రెడ్డి చెప్పారు. తమకు వచ్చిన లేఖ పైన అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
కర్నాటకలో దర్యాఫ్తు
దిల్‌సుఖ్ నగర్ పేలుళ్ల ఘటన నిందితులు కర్నాటకలో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నారు. దీంతో రెండు ఎన్ఐఏ బృందాలు బెంగళూరులో దర్యాఫ్తు కొనసాగిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి కర్నాటకలో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
నేరాలు, దాడులకు పాల్పడేవారు తప్పించుకోకుండా కఠినమైన చర్యలు తీసుకునేందుకు చట్టాల్లో మార్పులు తీసుకురావాలని మంత్రి టిజి వెంకటేష్ విజయవాడలో అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిని కఠినంగా శిక్షించాలన్నారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications