సిఎం హెచ్చరికల వ్యాఖ్యలపై విహెచ్ గరం, రోటినా?

V Hanumanth Rao
హైదరాబాద్: ఉగ్రవాదుల కదలికల గురించి కేంద్ర నిఘా సంస్థ ముందుగానే హెచ్చరించినా.. 'రొటీన్'గా తీసుకుంటారా?' అని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయాల కోసమే ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తే ఎలా? అని ఆయన మండిపడ్డారు. ఇంతమంది చనిపోయాక కూడా పట్టించుకోకుంటే ప్రజలు ప్రభుత్వాన్ని, నేతలను ఛీ కొడతారని హెచ్చరించారు.

జంట పేలుళ్ల ఘటనపై వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తీవ్రవాద ఘటనలు జరిగిన సందర్భాల్లో రాజకీయాలకు అతీతంగా ఉంటామని ఢిల్లీలో బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ చెప్పడాన్ని గుర్తు చేశారు. అందుకు భిన్నంగా హైదరాబాద్‌లో ఆ పార్టీ నేతలు బంద్‌కు బంద్‌కు పిలుపునివ్వడం ఏమిటని అడిగారు.

ప్రభుత్వం ఉగ్రవాదుల విషయంలో రాజీలేకుండా వ్యవహరించాలన్నారు. ఆక్టోపస్, ఎన్ఐఏ, కౌంటర్ ఇంటెలిజెన్స్, క్రైంబ్రాంచ్, టాస్క్‌ఫోర్స్, గ్రేహౌండ్స్‌లాంటి సంస్థలున్నా తప్పులు జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. డీజీపీ దినేష్ రెడ్డి ఈ హెచ్చరికలను రొటీన్ అని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదిలావుంటే, ఉగ్రవాదంపై రాజకీయాలకు అతీతంగా ఉమ్మడి పోరాటం చేయాల్సి ఉందని ఏఐసీసీ కార్యదర్శి పి.సుధాకర్ రెడ్డి అన్నారు. రాజకీయ విమర్శలతో పోలీసుల మనోధైర్యం దెబ్బతీసేలా మాట్లాడొద్దని హితవు పలికారు. ఈ విషయమై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీఎంకి విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+