పేలుళ్లు: ప్రధాని పరామర్శ, వెంట కిరణ్ (ఫోటోలు)
హైదరాబాద్: ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆదివారం ఉదయం హైదరాబాదులోని దిల్‌సుఖ్ నగర్ జంట పేలుళ్ల ఘటన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు న్యూఢిల్లీ నుండి బయలుదేరిన ప్రధాని పదకొండు గంటలకు భాగ్యనగరంలోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఆయనకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ ఇతర నాయకులు స్వాగతం పలికారు. అటు నుండి ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో సరూర్‌నగర్‌లోని విక్టోరియా స్మారక గృహానికి చేరుకున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా పేలుళ్ల ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు.
అక్కడి నుండి మలకపేటలోని యశోదా ఆసుపత్రిలో, ఆ తర్వాత కొత్తపేటలోని ఓమ్నీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి హామీ ఇచ్చారు. అటు నుండి ఆయన తిరిగి విక్టోరియా స్మారక గృహానికి చేరుకొని అక్కడి నుండి బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుండి న్యూఢిల్లీ వెళ్లారు.

దిల్‌సుఖ్ నగర్ చౌరస్తాలో ప్రధానికి వివరిస్తున్న ముఖ్యమంత్రి

పేలుడు జరిగిన ప్రాంతంలో పరిశీలిస్తున్న ప్రధాని

ముఖ్యమంత్రితో కలిసి సంఘటన స్థలంకు వెళ్తున్న ప్రధాని

పరిశీలిస్తున్న ప్రధాని

ఆసుపత్రికి వెళ్లేందుకు..

జంట పేలుళ్లు జరిగిన ప్రాంతం

జంట పేలుళ్లు జరిగిన ప్రాంతం

ఆసుపత్రిలోకి వెళ్తున్న ప్రధాని, ముఖ్యమంత్రి

క్షతగాత్రుడిని పరామర్శిస్తున్న ప్రధాని, ముఖ్యమంత్రి

క్షతగాత్రుడిని పరామర్శిస్తున్న ప్రధాని

క్షతగాత్రుడికి హామీ!












Click it and Unblock the Notifications