చంపేయాలా! క్రిమినల్ చర్య: బాబుపై బొత్స, కొండ్రు ఫైర్

పేలుళ్ల నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వానికి, బాధితులకు చేసిన సహకారం దేశానికి గర్వకారణం అని ప్రధాని అన్నారని గుర్తు చేశారు. హైదరాబాదు పేలుళ్ల ఘటన ప్రాంతాన్ని పరిశీలించి, బాధితులకు ధైర్యాన్ని ఇచ్చినందుకు తాము ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. చంద్రబాబు ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారని, అది సరికాదన్నారు. కత్తులు, కొడవళ్లతో తిరగబడాలన్న బాబు వ్యాఖ్యలను బొత్స ఖండించారు.
ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నాయని, అది దురదృష్టకరం అన్నారు. కాంగ్రెసు పార్టీని చంపేయాలని చంద్రబాబు పిలుపునిస్తున్నారని, తన హయాంలో రైతులను పట్టించుకోని ఆయన అలా ఎలా పిలుపునిస్తారన్నారు. కాంగ్రెసు రైతు పక్షపాతి అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజా విశ్వాసం కోల్పోయిన పార్టీ అని ధ్వజమెత్తారు. అప్కాబ్ చైర్మన్ పదవిని తెలంగాణ వారికి ఇచ్చామని చెప్పారు.
క్రిమినల్ చర్యలు
కత్తులు, కొడవళ్లతో రోడ్డెక్కాలన్న బాబు వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విరుద్దమని మంత్రి కొండ్రు మురళి అన్నారు. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని లేదంటే ప్రభుత్వం క్రిమినల్ చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. బాబు తన మనసు మార్చుకునే విధంగా టిడిపి నేతలు ఆయనను కోరాలన్నారు. రెచ్చగొట్టే ప్రకటనలు సరికాదన్నారు.
చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నట్లుగా ఉందన్నారు. కాంగ్రెసును చంపాలి, కత్తులు, కొడవళ్లతో రోడ్డెక్కాలని చెప్పడం ద్వారా ఆయన పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుల్ల వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు.


Click it and Unblock the Notifications