రెండోసారి గాదె: స్వామిగౌడ్, పాతూరి ఘన విజయం

Swamy Goud
హైదరాబాద్: ఉత్తరాంధ్ర నియోజకవర్గ ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుడిగా గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు. ఆయన పిఆర్‌టియు అభ్యర్థి. సమీప ప్రత్యర్థి సింహాద్రి అప్పడు పైన ఆయన 948 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. శ్రీనివాసులు నాయుడుకు 8468 ఓట్లు వచ్చాయి. ఇతను వరుసగా రెండోసారి విజయం సాధించాడు. సింహాద్రి అప్పడు ఎపిటిఎఫ్ అభ్యర్థి.

కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుడుగా పిఆర్‌టియు అభ్యర్థి పాతూరి సుధాకర్ రెడ్డి విజయం సాధించారు. పాతూరి 5023 ఓట్లతో గెలుపొందాడు. ఇతనికి వచ్చిన మొత్తం ఓట్లు 9324. పాతూరి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచారు.

కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వామి గౌడ్ గెలుపొందారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు పోటాపోటీగా జరుగుతోంది.

14 జిల్లాల్లోని ఆరు శాసనమండలి స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆయా జిల్లాల్లో కొనసాగుతోంది. మూడు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రుల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం జిల్లా కేంద్రాల్లో ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపును కరీంనగర్ అంబేడ్కర్ భవనంలో చేపట్టారు.

ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ విశాఖలో జరుగుతోంది. ఉభయ గోదావరి పట్టభద్రుల ఓట్ల లెక్కింపు కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో జరుగుతోంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల ఓట్లను నల్గొండలో లెక్కిస్తున్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+