ఆ పేలుళ్లు వైయస్ హయాంలోనే: షర్మిలకు కౌంటర్

Sharmila
హైదరాబాద్: 2007లో గోకుల్ చాట్, లుంబినీ పార్కులలో జరిగిన బాంబు పేలుళ్లు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే జరిగాయని భారత్ ఏక్తా ఆందోళన్ జాతీయ కన్వీనర్, దళిత నేత మల్లు రమేష్ ఆదివారం అన్నారు. కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం ఉన్నప్పటికీ ఉగ్రవాదుల దాడులను రాష్ట్ర ప్రభుత్వం నివారించలేక పోయిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలకు మల్లు రమేష్ కౌంటర్ ఇచ్చారు.

2007లోని పేలుళ్లు వైయస్ హయాంలోనే జరిగాయనే విషయాన్ని ఆమె మర్చిపోయారా అని ప్రశ్నించారు. నిఘా వర్గాల సమాచారం ఉండి కూడా అప్పటి పేలుళ్లను నాడు వైయస్ ఎందుకు ఆపలేకపోయారని ప్రశ్నించారు. నాటి దాడుల్లో తీవ్రంగా గాయపడ్డవారు ఇప్పటికీ నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయాల్లో రాజకీయాలకు అతీతంగా పార్టీలు స్పందించి బాసటగా నిలవాలని కోరారు.

పరిపక్వత లేని వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. స్వప్రయోజనాలకై కొన్ని శక్తులతో వైయస్ అనుసరించిన వైఖరే నేటి పరిణామాలకు కారణమన్నారు. ఐఎస్ఐ శక్తుల విచ్చలవిడితనానికి వైయస్ హయాంలోనే బీజం పడిందని ఆరోపించారు. ఈ విషయాన్ని గుర్తించి షర్మిల తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

సిఎంకు దాడి లేఖ

రాష్ట్రంలో గత ఎనిమిదేళ్ళలో నాలుగు ప్రాంతాల్లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో 75 మంది మృతి చెందారని, 229 మందికి పైగా క్షతగాత్రులయ్యారని అయితే, బాధితులకు వైద్యసాయం, నష్టపరిహారాలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టిడిపి సీనియర్ నాయకుడు దాడి వీరభద్ర రావు ధ్వజమెత్తారు. గతంలో జరిగిన విధ్వంసాలలో తీవ్రంగా గాయపడి ఇప్పటికీ కోలుకోలేకుండా ఉన్న బాధితులను తక్షణమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం ఈ మేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి ఆయన ఒక లేఖ రాశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+