హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒక్క రూపాయి పెంచినా ఊరుకోం: ప్యాప్సీ వద్ద ఉద్రిక్తం

By Srinivas
|
Google Oneindia TeluguNews

BV Raghavulu
హైదరాబాద్: విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను నిరసిస్తూ ప్యాప్సీ భవనం వద్ద విపక్ష పార్టీలు సోమవారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతం అయింది. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై ప్యాప్సీ భవనంలో చేపట్టిన బహిరంగ విచారణకు వివిధ పార్టీల నేతలు ఈ రోజు హాజరయ్యారు. ఛార్జీల పెంపు అక్రమమని టిడిపి నేతలు రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, తెరాస నేత హరీష్ రావు తదితరులు పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు.

ఛార్జీలను పెంచితే సహించేది లేదన్నారు. నేతలు ఆందోళన చేపడుతుండటంతో విచారణను అధికారులు నిలిపివేశారు. అంతకుముందు వీరి ఆందోళనల మధ్యనే ఈఆర్‌సి బహిరంగ విచారణ ప్రారంభమైంది. వామపక్షాలు, పలు ప్రజా సంఘాలు తదితరులు భారీగా బహిరంగ విచారణ జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. ఛార్జీల పెంపు అక్రమమని నిలదీశారు. ఈ ఆందోళనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు పాల్గొన్నారు. దీంతో ప్యాప్సీ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

విపక్షాల ఆందోళన ఎంతకూ తగ్గక పోవడంతో అధికారులు ఆ తర్వాత విచారణ నిలిపివేశారు. బహిరంగ విచారణ వాయిదాకు నేతలు పట్టు పట్టారు. ఈ రోజు ఉదయం ఒకసారి వాయిదా అనంతరం తిరిగి విచారణ ప్రారంభం కాగానే విపక్షాలు పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశాయి. ఈఆర్‌సి చైర్మన్, సభ్యులను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులు పలువురు నేతలను అక్కడి నుండి తరలించే ప్రయత్నాలు చేశారు.

విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై రాఘవులు తీవ్రంగా మండిపడ్డారు. బహిరంగ విచారణ అడ్డుకునేందుకు రాఘవులు పెద్ద ఎత్తున కార్యకర్తలతో అక్కడకు చేరుకున్నారు. కొన్ని గ్యాస్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం పెంచాలని చూస్తోందని ఆరోపించారు. ఇది బహిరంగ విచారణ కాదని, బూటకపు విచారణ అని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీలను ఒక్క రూపాయి పెంచినా ఊరుకునేది లేదన్నారు.

English summary
CPM's Raghavulu has blamed Congress government for power charges hike proposal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X