హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మేక వన్నెపులి!: మంచి ముసుగులో మహా ఖతర్నాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Syed Maqbool is dangerous
ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ తీరు మేక వన్నె పులి! పైకి స్నేహంగా ఉండే మక్బూల్ లోపల మాత్రం మహా ఖతర్నాక్!! ఉగ్రవాద ఖైదీలను ఉసిగొల్పుతూనే పైకి మంచి ముసుగు ధరిస్తుంటాడంట. అరెస్టుకు ముందు పలు నేరాలు చేసిన దాఖలాలు ఉన్నాయట. బలవంతపు వసూళ్లు, హత్యలు చేసిన చరిత్ర మక్బూల్‌కు ఉందట. మజ్లిస్ పార్టీ కార్యకర్తగా చలామణి అయ్యేందుకు ప్రయత్నించినా.. ఆ పార్టీ కార్యకర్తలు ఖండించారు. తమ పార్టీకి సంబంధం లేదని తేల్చేశారు.

ప్రస్తుతం ఇతను ఒక హత్య హత్య కేసులో చర్లపల్లి జైలులో యావజ్జీవ ఖైదీగా ఉన్నాడు. దాదాపు పదేళ్ల పాటు ఇదే జైలులో గడిపాడు. మక్బూల్‌తోపాటు అతని స్నేహితుడు ఖాసీంబేగ్‌కు కూడా హత్యకేసులో శిక్ష పడింది. వీరిని మంజీర బ్యారక్‌లోని ఐఎస్ఐ ఉగ్రవాద విచారణ ఖైదీలతో పాటు సింగిల్ సెల్స్‌లో ఉంచారు. భోజనం, వైద్యం, ములాఖత్ తదితరాల విషయంలో ఉగ్రవాద విచారణ ఖైదీలు తరచూ సిబ్బందితో వాగ్యుద్ధానికి దిగిన సందర్భాలు ఉన్నాయట.

మక్బూల్, ఖాసీం మాత్రం ఇలాంటి వివాదాల జోలికి వెళ్లేవారు కాదట. వారి సత్ప్రవర్తన కారణంగా పదేళ్ల శిక్షా కాలం పూర్తయ్యాక మంచి ఖైదీల జాబితాలో మక్బూల్, ఖాసీంలు వైయస్ హాయంలో విడుదలయ్యారు. మక్బూల్ పైకి మంచి ప్రవర్తనతో మెలిగినప్పటికీ జైలు అధికారుల పైకి తోటి ఐఎస్ఐ ఖైదీలను రెచ్చగొట్టేది మాత్రం అతనేనట. చేయాల్సింది వెనుక చేస్తూ బయటకు మంచి ముసుగు ధరించేవాడట. మక్బూల్ గత చరిత్ర నేరమయమే!

మహారాష్ట్రలోని ధర్మాబాద్‌లోని సంతానగర్‌కు చెందిన మఖ్బూల్ మరో ఉగ్రవాది ఆజంఘోరీతో కలిసి అనేక దోపిడీలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. డబ్బులు ఇవ్వని వారిని నిర్దాక్షిణ్యంగా హతమార్చినట్లుగా కూడా చెబుతున్నారు. ఓ కేసుకు సంబంధించి మక్బూల్‌ను 2000 జూన్ 2న బోధన్‌లో అరెస్టు చేశారు. క్షమాభిక్ష అనంతరం తిరిగి ధర్మాబాద్ చేరుకుని దందా మొదలుపెట్టారు.

గత ఏడాది గణపతి నిమజ్జనానికి ముందు పోలీస్ స్టేషన్‌కు రావాలని మక్బూల్‌ను పోలీసులు ఆదేశిస్తే తాను రానని చెప్పడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డాడట. దీనిపై కేసు నమోదైంది. మక్బూల్ మజ్లిస్ ధర్మాబాద్ తాలూకా అధ్యక్షుడినంటూ తనకు తానుగా ప్రకటించుకుని హల్‌చల్ సృష్టించాడు. దీనిని స్థానిక మజ్లిస్ నేతలు ఖండించారు. మక్బూల్‌తో తమకు సంబంధం లేదని మజ్లిస్ అధ్యక్షుడు, ఎంపి అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు.

English summary
It is said that Syed Maqbool is very dangerous person.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X