కత్తులతో తిరగబడండి: బాబు, వైయస్ రాక్షసుడిలా..

రైతులు కత్తులు, కొడవళ్లతో...గీత కార్మికులు మోకులతో రోడ్డెక్కి తిరగబడితేనే కాంగ్రెస్‌కు బుద్ది వస్తుందన్నారు. కల్లును నిషేధించి గీత కార్మికుల పాలిట వైయస్ రాక్షసుడిలా వ్యవహరించారని మండిపడ్డారు. అతను పెత్తందారీ, భూస్వామ్య పోకడలతో వ్యవహరించేవారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో రాక్షసపాలన కొనసాగిస్తోందని, విద్యుత్ చార్జీలు మొదలు నిత్యావసర సరుకుల ధరల దాకా సమస్తం పెంచేసి ప్రజల నడ్డి విరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలను నరకయాతన పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇక అధికారంలోకి రాదని, దాన్ని ఎవరూ కాపాడలేరని జోస్యం పలికారు. ఇప్పుడు ఆ పార్టీకి చావు తెలివి పుట్టుకు వచ్చిందని, రుణమాఫీ, బిసిలకు 100 సీట్లపై తాను పాదయాత్రలో ఇస్తున్న హామీలను తామూ అమలు చేస్తామని నమ్మించే ప్రయత్నం చేస్తోందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే గీత కార్మికులను ఎక్సైజ్ శాఖ నుంచి తొలగించి పౌరసరఫరాల పరిధిలోకి తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
వ్యవసాయం కోసం చాలామంది రైతులు ఇంట్లో ఆడవారి బంగారాన్ని తాకట్టు పెట్టారని, ఆ రుణాలన్నింటినీ మాఫీ చేసి ఆ బంగారమంతా విడిపిస్తామని చంద్రబాబు వాగ్దానం చేశారు. ఒక అన్నగా, తమ్ముడిగా ఆ బంగారాన్ని ఆడబిడ్డలకు బహుమతిగా ఇప్పిస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రక్షణ కల్పించలేరని చంద్రబాబు విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలు రోషం తెచ్చుకొని ఎన్నికల రోజున డబ్బు, మద్యానికి ప్రలోభపడకుండా తనను గుర్తు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ హైదరాబాద్‌కు ఎందుకొచ్చిందీ అర్థం కావడం లేదని బాబు అన్నారు. ఇంత దూరం వచ్చి అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులకు హెచ్చరిక జారీ చేయకపోవడం దారుణమనమన్నారు. కేవలం బాధితుల పరామర్శకే ప్రధాని పర్యటన పరిమితం కావడం ఏమిటని ఘాటుగా ప్రశ్నించారు.
2,100 కిలోమీటర్లు పూర్తి
కాగా, బాబు పాదయాత్ర ఆదివారం నాటికి 2,100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణం ఇసుకపల్లి నెహ్రూ విగ్రహం వద్ద ఆయన ఈ దూరం అధిగమించారు. ఇప్పటివరకు చంద్రబాబు 13 జిల్లాలు 58 నియోజకవర్గాల పరిధిలోని 115 మండలాల్లో పాదయాత్ర జరిపారు.












Click it and Unblock the Notifications