హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళా టెక్కీ ఆత్మహత్య: గుండెపోటు, దిగిన విమానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Karimnagar
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని మియాపూర్‌లో ఓ మహిళా సాఫ్టువేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. ఇరవై నాలుగేళ్ల రమ్య అనే సాఫ్టువేర్ ఇంజనీర్ ఆల్విన్ కాలనీలో ఉంటోంది. ఆమె హైటెక్ సిటీలోని ఓ సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. శనివారం రాత్రి ఆమె మియాపూర్‌లో తాను ఉంటున్న ఇంటిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

తన భర్త, సోదరుడు బయటకు వెళ్లిన సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. రమ్య కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా రమ్య ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతున్నారని మియాపూర్ పోలీసులు చెప్పారు.

గుండెపోటు.. దిగిన విమానం

ప్రయాణీకురాలికి గుండెపోటు రావడంతో ఆదివారం ఓ విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా దింపారు. ఆమె విమానాశ్రయంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆదివారం దుబాయ్ నుంచి ఎమిరేట్స్ ఈకె-418 విమానం బ్యాంకాక్ బయలుదేరింది.

ఆస్ట్రేలియాకు చెందిన జోసబ్ ఇలినా(31) అనే మహిళను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఇదే విమానంలో బ్యాంకాక్ తీసుకెళ్తున్నారు. మార్గ మధ్యలోనే గుండెపోటు రావడంతో పైలట్ శంషాబాద్ విమానాశ్రయ అధికారుల అనుమతితో విమానం దింపారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

మౌలాలీలో హత్య

హైదరాబాదులోని మౌలాలీ ప్రాంతంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది.

English summary

 A 24 year old software engineer, identified as Ramya, was found hanging from the ceiling fan in her flat in Miyapur on Saturday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X