ప్రేయసి గొంతు కోసిన ఉన్మాది, మహిళ హత్య

Hyderabad
హైదరాబాద్: గుంటూరు జిల్లాలో తాడేపల్లి కెఎల్ రావు కాలనీలో సోమవారం ఉదయం ప్రేమోన్మాది శ్రీను ప్రియురాలిపై దాడికి పాల్పడ్డాడు. ప్రియురాలి గొంతు కోశాడు. ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

కారు ఢీకొని విద్యార్థి మృతి

కారు ఢీకొట్టడంతో సైకిల్‌పై కళాశాలకు వెళ్తున్న ఓ విద్యార్థిని మృత్యువు బలి తీసుకుంది. మెదక్ జిల్లా చేగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న స్వామి (17) అనే విద్యార్థిని స్వగ్రామం పొతనపల్లి నుంచి సైకిల్‌పై కళాశాలకు వెళ్తుండగా జాతీయ రహదారిపై కారు ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మహిళ దారుణ హత్య

హైదరాబాదులోని మౌలాలీ వడ్డెరబస్తీలో లక్ష్మి నే 50 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురైంది. కూలి చేసుకుంటూ జీవించే లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు వచ్చి కత్తితో పొడిచి చంపారు. ఆమె ఒంటిపై ఉన్న నగలు మాయమయ్యాయి. దీంతో నగల కోసమే ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కోనేరులో పడి బాలుడి మృతి

అనంతపురం జిల్లా గుత్తి మండలం దొండపాడులో రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చిన ఓ బాలుడు కోనేరులో పడి మరణించాడు. రవి అనే 14 ఏళ్ల బాలుడు ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత స్వామివారిని దర్శించుకునేందుకు స్నానం చేయడానికి కోనేరులోకి దిగాడు. ప్రమాదవశాత్తు అందులో పడి మరణించాడు. కోనేరులో ఏ విధమైన రక్షణ ఏర్పాట్లు లేకపోవడమే బాలుడు మృతికి కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ప్రకాశం జిల్లా పర్చూరు మండలం చెరుకూరు వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ అటో అదుపు తప్పి బోల్తాపడడంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయపిడనవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బల్లికురువ మండలం వి. కొత్తెరపాడు వద్ద రెండు లారీలు పరస్పరం ఢీకొనడంతో ఒక వ్యక్తి మరణించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+