కాంగ్రెస్‌కు మోకరిల్లను, నన్ను ఉరితీయండి: రాజోనా

తన తరఫున ఎవరూ అలా కోరాల్సిన అవసరం కూడా లేదన్నాడు. ఉరికంబం ఎక్కడానికి సిద్ధమని చెప్పాడు. రాజోనా ఉత్తరంతో, అతని తరపున కేంద్రం వద్ద లాబీయింగ్ చేస్తున్న శిరోమణి అకాలీదళ్ పరిస్థితి ఇరకాటంలో పడింది. 2006లో అతనికి కోర్టు ఉరిశిక్ష విధించగా, 2012 మార్చి 31న దాన్ని అమలు చేయాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం అతడి తరఫున క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి పరిశీలనలో ఉంది.
తనను ఉరికంబం ఎక్కించాలని ఆయన నాలుగు పేజీల లేఖ రాశాడు. మరణశిక్షను సవాల్ చేసేందుకు రాజోనా తిరస్కరించినా.. రాజకీయ వర్గాలు మాత్రం అతడి శిక్షను తగ్గించాలని లాబీయింగ్ చేస్తున్నాయి. ప్రస్తుతం రాజోనా పాటియాలా జైలులో ఉన్నాడు. రాజోనాను ఇటీవల ఆయన సోదరి కలిసింది. అప్పుడు ఆయన లేఖ ఇచ్చాడు. తాను క్షమాభిక్షను అభ్యర్థించలేదని, తన కోసం ఆ పని చేయాలని తాను ఎవరినీ కోరలేదని లేఖలో పేర్కొన్నాడు. రాజోనా గతంలోను మరణశిక్షను సవాలు చేసేందుకు తిరస్కరించాడు.












Click it and Unblock the Notifications