అనుమానంతో భార్యను చంపిన 68 ఏళ్ళ వృద్ధుడు

Man murders 61 year old wife
థానే: అరవై ఎనిమిదేళ్ల ఓ వ్యక్తి తన అరవై ఒక్కేళ్ల భార్యపై అనుమానంతో హత్య చేసిన సంఘటన థానేలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ఉల్లాస్‌నగర్‌లో జహంగీర్ గోవర్ధన్ పవార్ తన భార్య వైజయంతితో కలిసి నివాసముంటున్నాడు. వీరి ముగ్గురు పిల్లలు కూడా వివాహాలు చేసుకొని స్థిరపడ్డారు. ఈ వృద్ధుడు భార్య ప్రవర్తన మీద అనుమానం పెంచుకున్నాడు. ఈ అంశంపై రోజూ భార్యాభర్తల మధ్య గొడవ జరిగేది.

అలాగే రెండు రోజుల క్రితం కూడా వారి మధ్య గొడవ ప్రారంభమైంది. కోపం పట్టలేని పవార్ తన భార్యను కత్తితో పొడిచి చంపాడు. దీంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యను హత్య చేసిన అనంతరం ఆ వృద్దుడు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని వైజయంతి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

అత్యాచారం కేసులో శిక్ష

పన్నెండేళ్ల బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డ కేసులో ఢిల్లీ కోర్టు ఒకరికి జీవిత ఖైదును, మరొకరికి పదేళ్ల జైలు శిక్షను విధించింది. బాధితురాలి అక్కపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో ఇరవై నాలుగేళ్ల మనోజ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అతనికి అమిత్ అనే వ్యక్తి సహకరించాడు. మనోజ్‌కు జీవిత ఖైదు, అమిత్‌కు పదేళ్ల శిక్ష పడింది. బాధితురాలి అక్క స్నేహితురాలితో మనోజ్ సహజీవనం చేసేవాడు.

వారి మధ్య గొడవలతో తరుచూ పోలీసులను ఆశ్రయించేవారు. ఓసారి బాధితురాలు అఖ్క తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిందన్న అక్కసుతో మనోజ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మనోజ్, అమిత్‌లకు అరవై వేల రూపాయలు, ఇరవై వేల రూపాయల జరిమానా విధించారు. గత ఏడాది ఫిబ్రవరి ఆరున బాధితురాలిని కారులో తిప్పుతూ ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+