• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రియాజ్ భత్కల్: గర్ల్స్ చూపులకు చాక్‌లెట్ బాయ్

By Pratap
|
Riyaz Shahbandri
ముంబై: దేశంలో దావూద్ ఇబ్రహీం, పాకిస్తానీ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ల కన్నా ఎక్కువ మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాది రియాజ్ భత్కల్ కళాశాలలో వెనక వెనకే ఉండేవాడు. అతను చాలా సిగ్గరి. కుర్లకు చెందిన రియాజ్ షాబంద్రీ నాగ్‌పడలోని సాబూ సిద్దిఖ్ కశాశాలలో 1993లో సివిల్ ఇంజనీరింగ్ చదివాడు. కళాశాల కార్యక్రమాల్లో పాల్గొనేవాడు కాదు. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా రియాజ్ వ్యక్తిగత జీవితంపై, అతని చర్యలపై ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది.

మీడియా కథనాల ప్రకారం - రెండు దశాబ్దాల తర్వాత అనుమానిత ఉగ్రవాది రియాజ్ భత్కల్‌గా పతాక శీర్షికలకు ఎక్కాడు. దేశంలో 15 బాంబు పేలుళ్ల వెనక అతడు ఉన్నాడని ఆరోపణ. ఈ పేలుళ్లలో 244 మంది మరణించారు. ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన కరుడు గట్టిన ఉగ్రవాదిగా పేరు పొందిన భత్కల్ ఆచూకీ ఇప్పటికీ చిక్కడం లేదు.

కర్ణాటకలోని భత్కల్ గ్రామంలో 1976లో జన్మించాడు. అతని అసలు పేరు రియాజ్ ఇస్మాయిల్ షాబంద్రీ. కుర్లాలోని 60 ఏళ్ల నాటి రెండంతస్థుల ఖాదీర్ మాన్షన్‌లో ఉన్నప్పుడు అతన్ని రోషన్ జమాల్‌గా పిలిచేవారు. ఇందులో ప్రస్తుతం అతని కుటంబానికి రెండు గదులున్నాయి. భత్కల్ కోసం పోలీసులు వచ్చీపోతుండడంతో ఆ కుటుంబం ఇల్లు వదిలిపెట్టింది.

రియాజ్ పుట్టడానికి ముందే అతని తండ్రి ఇస్మాయిల్ కర్ణాటక నుంచి ముంబైకి వచ్చి పర్సుల తయారీ వ్యాపారం చేయడం ప్రారంభించాడు. సివిల్ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం రాకపోవడం రియాజ్ తండ్రికి వ్యాపారంలో సహకరిస్తూ వచ్చాడు. అన్న ఇక్బాల్ స్థానిక డెవలపర్స్ కంపెనీలో సివిల్ ఇంజనీర్‌గా చేరాడు.

రియాజ్ 2001లో కుర్లాకు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. అయితే, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఆ తర్వాత భత్కల్‌కు చెందిన వ్యాపారి కూతురు నషౌను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి కొద్ది నెలల ముందు అతనికి స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) కుర్లా శాఖతో పరిచయం ఏర్పడింది.

అతను చేరడానికి ముందే సిమిలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. మితవాద, అతివాద గ్రూపులుగా చీలిపోయింది. రియాజ్ అతివాద గ్రూపులో ఉంటూ వచ్చాడు. సిమిని ప్రభుత్వం నిషేధించిన తర్వాత దానికి సంబంధించిన నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు రియాజ్ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు.

సిమి సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తుండడం వల్ల అనుచరుల్లో ముఖ్యమైనవాడిగా రియాజ్ మారిపోయాడు. స్థానిక గుండాలతో సంబంధాలు పెరిగాయి. వారితో కలిసి వ్యాపారుల నుంచి సిమీ కార్యకలాపాల కోసం మామూళ్లు వసూలు చేసేవాడు. కుర్లాలోని దీపక్ ఫర్సాన్ హత్య కోసం రియాజ్ సుపారీ ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. కాల్పుల్లో దీపక్ ఫర్సాన్ యజమాని బాడీగార్డు మరణించాడు. అయినా, రియాజ్‌ను అరెస్టు చేయలేదు.

ఆ తర్వాత ఏడాదికి అక్రమంగా అతను పాకిస్తాన్‌కు చేరుకున్నాడు. మారణాయుధాలను ఉపయోగించడంపై, పేలుడు పదార్థాలను కూర్చడంపై లష్కరే తోయిబా శిబిరంలో శిక్షణ పొందాడు. తిరిగి వచ్చిన తర్వాత 2004లో భత్కల్‌లోని జాలీ బీచ్ ఫామ్ హౌస్‌లో భారతదేశానికి చెందినవారికి అతిఫ్ అమీన్ (2008లో బాట్లా హౌస్ ఎదురుకాల్పుల్లో మరణించాడు), సాదిఖ్ అస్రాస్ షేక్ (ముంబైలో కటకటాల వెనక ఉన్నాడు), సుభాన్ ఖురేషీ అలియాస్ తాఖీర్, యాసిన్ భత్కల్ (ఇద్దరూ పరారీలో ఉన్నారు) అతను శిక్షణ ఇచ్చాడు.

యాసిన్ భత్కల్‌కు చెందినవాడే అయినప్పటికీ రియాజ్‌ కుటుంబానికి చెందినవాడు కాడు. ఆ రకంగా రియాజ్ గ్రూపు 2005లో ఉత్తరప్రదేశ్‌లోని సంట్ మోచన్ దేవాలయంలో తొలి పేలుడు పథకాన్ని అమలు చేసింది. రియాజ్ పేలుడు పదార్థాలను సమకూర్చగా తాఖీర్, షేక్ మనుషులను ఎంపిక చేసుకున్నారు. ఈ సయమంలోనే తమ సంస్ఠకు వారు ఇండియన్ ముజాహిదీన్‌గా పేరు పెట్టుకున్నారు. అప్పటికి కూడా దాని ఉనికి గురించి పోలీసులకు తెలియదు.

లక్నో కోర్టు ఆవరణలో, వారణాసి, ఫైజాబాద్‌ల్లో 2007 నవంబర్ 23వ తేదీన బాంబు పేలుళ్లకు పాల్పడిన తర్వాత తామే వాటికి బాధ్యులమంటూ న్యూస్ చానెళ్లకు మొదటి మెయిల్ పంపించారు. 2008లో ఇండియన్ ముజాహిదీన్ బెంగళూర్, అహ్మదాబాద్ పేలుళ్లపై దర్యాప్తు చేస్తున్నప్పుడు రియాజ్ పేరు ముందుకు వచ్చింది. ఈ పేలుళ్లకు ముందు రియాజ్ ఏడు రోజుల పాటు భత్కల్‌లో కొత్తగా చేరినవారికి శిక్షణ ఇచ్చాడు.

రియాజ్ కోసం పోలీసులు భత్కల్‌కు వస్తూ పోతూ ఉండడం సాగించారు. దీంతో అతను 2008లో బంగ్లాదేశ్ మీదుగా పాకిస్తాన్ పారిపోయాడు. అదే రియాజ్‌ను అతని కుటుంబ సభ్యులు చూడడం. 2008 ఏప్రిల్ 16వ తేదీ నుంచి అతని తండ్రి జాడ కూడా కనిపించకుండా పోయింది. ఆ రోజు అద్దెను వసూలు చేసుకోవడానికి అతను ఖాదీర్ మాన్షన్‌కు వెళ్లాడు.

రియాజ్ 2010లో కొలంబోకు వెళ్లి యాసిన్ భత్కల్, మోసిన్ చౌదరి, మిర్జా హిమాయత్ బెయిన్ కలిసి పూణే జర్మన్ బేకరీ బాంబు పేలుళ్లకు పథకం రచించినట్లు సమాచారం. 2008లో జరిగిన బెంగళూర్ పేలుళ్ల కేసులో రియాజ్‌పై 2011 జూలైలో రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. పేలుళ్లకు యాసిన్ భత్కల్, రియాజ్ కుట్ర చేశారని చార్జిషీట్‌లో పేర్కొన్నారు. పాకిస్తాన్‌ నుంచి నడిచే నిషేధిత ఇండియన్ ముజాహిదీన్‌ భారతదేశంలో ఉగ్రవాదాన్ని విస్తరింపజేస్తోందని, రియాజ్, అతని సోదరుడు ఇక్బాల్ భత్కల్ పాకిస్తాన్ నుంచి పనిచేస్తున్నారని, యాసిన్ ద్వారా ఎలక్ట్రానిక్స్ సాధనాల అనుచరులకు సూచనలు ఇస్తుంటారని వివరించారు. రియాజ్‌తో పాటు ఇక్బాల్ భత్కల్ కూడా ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుల్లో ఒకతను.

రియాజ్ దుశ్చర్యలు ఇవే..

2005 అక్టోబర్ 29: ఢిల్లీలోని పహర్‌గంజ్, సరోజినీ నగర్, గోపాల్ నగర్, 62 మంది మృతి

2006 మార్చి 7: సంకట్ మంచ్ దేవాలయం, వారణాసిలోని కాశీ విశ్వనాథాలయం, 28 మంది మృతి

2006 నవంబర్ 24: ఫైజాబాద్, లక్నో, వారణాసి కోర్టు

2007 మే 25: గోరఖ్‌పూర్ మార్కెట్

2007 ఆగస్టు 25: హైదరాబాదులోని లుంబనీ పార్కు, గోకుల్ చాట్, 42 మంది మృతి

2008 మే 23: జైపూర్, 80 మంది మృతి

2008 జూలై 24: బెంగళూర్, ఇద్దరు మృతి

2008 జులై 25: అహ్మదాబాద్ వరుస పేలుళ్లు, 56 మంది మృతి

2008 జులై 26: సూరత్, బాంబులను నిర్వీర్యం చేశారు.

2008 సెప్టెంబర్ 13: ఢిల్లీ, 30 మంది మృతి

2010 ఫిబ్రవరి 13: పూణే జర్మన్ బేకరీ, 17 మంది మృతి

2011 జులై 13: ముంబైలో మూడు పేలుళ్లు, 27 మంది మృతి

2012 ఆగస్టు 1: పూణే వరుస పేలుళ్లు

మొత్తం మృతుల సంఖ్య: 344

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary

 According to media reports - Seventeen-year-old Riyaz Shahbandri from Kurla was a shy civil engineering student at Nagpada's Saboo Siddik polytechnic in 1993. He would maintain a low profile and hardly participated in any college events.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more