ఢిల్లీలో బాంబుల కలకలం: ల్యాప్‌టాప్ బ్యాగ్ దడ

ఇద్దరు యువకులు బైక్ వచ్చి సంచీని పడేసి అదే వేగంతో వెళ్లిపోయినట్లు సమాచారం. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బ్యాగ్‌లో ఏముందనే విషయాన్ని తెలుసుకోవడానికి ఆర్మీ 202 బాంబు డిస్బోజల్ స్క్వాడ్ అత్యధునాతనమైన రియల్ టైమ్ స్కానర్‌ను వాడారు. ఆ తర్వాత సంచీని తెరిచి చూశారు. దాంట్లో టవల్, ఇటుక, సోప్ కేస్ కనిపించాయి. బ్యాగ్‌లో బాంబులు ఉండవచ్చుననే అనుమానంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
గ్రేటర్ కైలాష్ పార్ట్ వన్‌లోని ఎన్ బ్లాక్ మార్కెట్ వద్ద పార్క్ చేసి ఉన్న మోటార్ సైకిల్‌పై మరో బ్యాగ్ కనిపించింది. దీంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. అయితే, బైక్ యజమాని వచ్చి ఆ సంచీ తనదేనని, కావాలంటే తనిఖీ చేసుకోవచ్చునని చెప్పడంతో ఒక్కసారిగా పోలీసులు ఊరట పొందారు.
హైదరాబాద్ బాంబు పేలుళ్ల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ బాంబు పేలుళ్లలో 16 మంది మరణించారు. వంద మందికిపైగా గాయపడ్డారు.


Click it and Unblock the Notifications