హైదరాబాద్ పేలుళ్లు: తిష్టవేసి బాంబుల తయారీ ఇక్కడే

ఫోరెన్సిక్ నిపుణుల అంచనా ప్రకారం - బాంబు త యారీకి అమ్మోనియం నైట్రేట్‌ని ఉపయోగించారు. ఇందులో కిలోన్నర దాకా ఈ పేలుడు పదార్థాన్ని ఉపయోగించారు. బాగా మండే స్వభావం కలిగిన ఆయిల్‌తో దాన్ని ముద్దచేశారు. కేలక్యులేటర్లు, చిన్న రేడియోలకు వాడే మూడు వాట్ల బ్యాటరీలను ఐదు చొప్పున ఒక్కో బాంబు కు వాడారు. అంటే బాంబుకు దాదాపు 15 వాట్ల పవర్‌ను ఉపయోగించారు. ఈ బ్యాటరీలను ఒక డిటోనేటర్‌కు కలిపారు. దానికి ఒక డిజిటల్ డిలే టైమర్‌ను అమర్చారు. టైమర్ పనిచేయడానికి, డిటోనేటర్ పేలడానికి పవర్‌ను అందించేందుకు ఒక స్విచ్‌ను ఏర్పాటు చేశారు. స్విచ్ ఆన్‌చేయగానే నిమిషం వ్యవధిలో లేదా అంతకన్నా తక్కువ సమయంలోనే పేలేలా టైమ్ సెట్‌చేశారు.
బాంబు పేలుడు ప్రభావం భయానకంగా ఉండే లా ఒక ప్లెక్సీ క్లాత్‌లో భారీగా మేకులు, గుండుసుదులు ఉంచి బాంబు చుట్టూ కట్టారు. సైకిల్ వెనుక ఉండే స్టాండ్‌లో ఈ బాంబును అమర్చారు. బాంబు కనపడకుండా మరో రెగ్జిన్ కవర్‌ను చుట్టారు. బాంబు పేలగానే ఇనుప ముక్కలు బయటకొచ్చాయి. ప్లెక్సీక్లాత్ ముక్కలు ముక్కలు గా చెల్లాచెదురైంది. కొన్ని ముక్కలు తగలబడి పోగా మరికొన్ని సగం కాలాయి. వాటిలో కొన్నింటిని క్లూస్‌టీం సేకరించింది. ఆ ముక్కలన్నీ ఒక దగ్గర చేర్చగా ఉర్దూ అక్షరాలు ఆ గుడ్డపై కనిపించాయి. వాటిని డీకోడ్ చేయగా కీలక విషయాలు తెలిసినట్టు సమాచారం. బాంబులను పేల్చడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారని ఫో రెన్సిక్ నిపుణులు చెబుతున్నారు.
బాంబులు పేల్చేందుకు రిమోట్ వాడలేదని, వాటికి సంబంధించిన శకలాలు కానీ, ఇతర ఆధారాలు కానీ ఎక్కడా లభించలేదని ఫోరెన్సిక్ అధికారులు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ అంశాలపై రేపోమాపో ఫోరెన్సిక్ నిపుణులు నివేదిక అందించనున్నాను.
బాంబుపేలుళ్లకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌లో అనుమానితుల ముఖాలు అస్పష్టంగా ఉన్నాయి. దాంతో ప్రపంచంలోనే అధునాతనమైన ల్యాబ్ ఉన్న కెనడాకు ఫుటేజ్‌ను పంపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఎక్స్‌ప్లోజివ్స్ ఆధారాలు, శాంపిల్స్‌ను సోమవారం ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీకి పంపించారు.












Click it and Unblock the Notifications