హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిల్‌షుక్‌నగర్ పేలుళ్లు: సైకిల్ చేసిస్‌ నెంబర్‌తో క్లూస్

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad Blasts
హైదరాబాద్: దిల్‌షుక్‌నగర్ పేలుళ్లకు వాడిన రెండు సైకిళ్లలో ఒక సైకిల్ చేసిస్ నెంబర్ ఆధారంగా కేసుకు సంబంధించిన క్లూలను రాబట్టే ప్రయత్నంలో దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు. చేసిస్ నెంబర్ ఆధారంగా సైకిల్ యజమానిని గుర్తించేందుకు సిఐడి అధికారులు, హైదరాబాద్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

రెండు సైకిళ్లలో ఒక సైకిల్ చేసిస్ నెంబర్ స్పష్టంగా కనిపిస్తోందని, రెండో సైకిల్ చేసిస్ నెంబర్‌ను గుర్తించడంలో దర్యాప్తు అధికారులు విఫలమయ్యారని అంటున్నారు. దర్యాప్తునకు ఎంత వరకు ఉపయోగపడతుందో చెప్పలేం గానీ సైకిల్ యజమానిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అంటున్నారు. రెండు సైకిళ్లు కూడా ఒకే రకంగా ఉన్నాయని, కొన్ని విడిభాగాలను మార్చారని అంటున్నారు.

కీలకమైన సిసిటీవి ఫుటేజ్‌ను అహ్మదాబాద్‌లోని ఫోరెన్సిక్ లాబొరేటరీకి పంపిస్తున్నారు. సైకిల్‌ కేరియర్‌పై బ్యాగ్ పెట్టుకుని వెళ్తున్న వ్యక్తిని గుర్తించడానికి హైదరాబాద్ పోలీసులు ఆ పని చేస్తున్నారు. ఆ వ్యక్తి కొన్ని నిమిషాల తర్వాత సైకిల్ లేదా బ్యాగ్ లేకుండా వెనుదిరిగి వెళ్లిపోవడం కూడా సిసిటీవి కెమెరాలో రికార్డు అయింది.

ఫుటేజీని పెద్దది చేసి గుర్తించడానికి ప్రయత్నించామని, అయితే అది చాలా శ్రమతో కూడుకున్న పని అని, ఎఫ్‌బిఐ ఆ పనిని సులభంగా చేయగలదని, అయితే తొలుత దాన్ని అహ్మదాబాద్‌లోని ఫోరెన్సిక్ లాబోరేటరీకి పంపుతున్నామని సంబంధిత అధికారులు అంటున్నారు.

కేంద్ర దర్యాప్తు సంస్థ పెద్దది చేసిన ఫుటేజీని పంపించిందని, అయినా అది అంత స్పష్టంగా లేదు. ఎఫ్‌బిఐకి పంపించడమే తమకు చివరి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందని అంటున్నారు. ముఖాలను దాచుకోవడానికి స్కార్ఫ్‌ను గానీ, టోపీని గానీ ధరించి ఉంటారని అనుమానిస్తున్నారు.

English summary
Investigators probing the Dilsukhnagar terror strike are trying to generate leads based on the chassis number of one of the two mangled cycles used in the blasts. The Crime Investigation Department ( CID) and the Hyderabad police are making efforts to locate the owner of the cycle using the chassis number.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X