చుక్కెదురు: కడప మాజీమేయర్ రవీంద్రనాథ్‌కి రిమాండ్

ఆయనపై కడప వన్ టౌన్ పిఎస్‌లో కేసు నమోదు కాగా ఈ రోజు కడప ఫస్ట్ ఎడిఎం కోర్టులో లొంగిపోయారు. అతనిపై నాలుగు సెక్షన్ల క్రింద కేసు నమోదయింది. తన లాయర్ల సమక్షంలో ఆయన దాదాపు నెల రోజుల తర్వాత కోర్టులో లొంగిపోయారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నప్పటికీ చుక్కెదురయింది. ఇప్పుడు మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
మరోవైపు రవీంద్రనాథ్ రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కడప జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సహకార ఎన్నికల్లో ఫోర్జరీకి పాల్పడిన అంశంపై విచారణ జరిపేందుకు తమ కస్టడీకి ఆయనను అప్పగించాలని పోలీసులు కోర్టును కోరారు. విచారణకు స్వీకరించిన కోర్టు దానిని వాయిదా వేసింది.
కాగా అంతకుముందు రవీంద్రనాథ్ రెడ్డి మంగళవారం ఉదయం కడప జిల్లా కోర్టు ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. రవీంద్రనాథ్ రెడ్డి పైన చీటింగ్, పోర్జరీ కేసు నమోదయింది. సహకార ఎన్నికల్లో పోర్జరీకి పాల్పడ్డారని రవీంద్రనాథ్ రెడ్డి పైన ఆరోపణలు ఉన్నాయి. ఈ రోజు ఇతను కోర్టు ఎదుట లొంగిపోయారు. రవీంద్రనాథ్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు గతంలో వార్తలు కూడా వచ్చాయి.
ఇటీవల జరిగిన సహకార ఎన్నికలలో ఆయన సాయంత్రం దాకా ఆయన సహకార శాఖ అధికారులను నిలదీస్తూ హడావుడి చేశారు. అంతలోనే ఆయన మాయమయ్యారు. ఆయనపై నమోదైన ఫోర్జరీ, చీటింగ్ కేసులు కొట్టివేసేందుకు హైకోర్టు నిరాకరించడమే అందుకు కారణమని వార్తలు వచ్చాయి. పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిన వెంటనే పోలీసులు రవీంద్రనాథ రెడ్డి అరెస్టుకు రంగంలోకి దిగారని అయితే, ఆయన వారికి చిక్కలేదు. ఈ రోజు ఆయన లొంగిపోయారు. కోర్టు అతనికి రిమాండు విధించింది.












Click it and Unblock the Notifications