భర్తను కొట్టి చంపిన భార్య: పిల్లలూ సహకరించారు

Wife kills husband in Warangal district
వరంగల్: తాగుడుకు బానిసై ఇంటిని పట్టించుకోకుండా నిత్యం చిత్రహింసలు పెడుతున్న వ్యక్తిని భార్యాపిల్లలు కర్రలతో కొట్టిచంపిన సంఘటన వరంగల్ జిల్లా జనగామ మండలం శామీర్‌పేటలో సోమవారం జరిగింది. శామీర్‌పేటకు చెందిన కాసారం యాదగిరి(43) హోటల్‌లో కార్మికుడిగా పనిచేస్తుండగా, భార్య మంగ కూలి పని చేస్తోంది. వీరికి ఇద్దరు కొడుకులు- ఏడో తరగతి చదువుతున్న ప్రసాద్, ఆరో తరగతి చదువుతున్న ప్రవీణ్. మంగ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో ఆమె చెల్లెళ్లు సుధ, రమ కూడా వీరితోనే ఉంటున్నారు.

యాదగిరి ఆదివారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఇంటికి చేరుకుని భార్యాపిల్లలపై బ్లేడుతో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వేధింపులతో విసిగిపోయిన భార్యాపిల్లలు కలిసి యాదగిరిని కర్రలతో చితకబాదారు. తీవ్రగాయాలు కావడంతో యాదగిరి మరణించాడు. భర్త నిత్యం పెడుతున్న వేధింపులు భరించలేకే కొట్టినట్లు మంగ మీడియాకు తెలిపింది. మృతుడి తల్లి నర్సమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మంగతోపాటు ఇద్దరు పిల్లలను అదుపులోకి తీసుకున్నారు.

యాదగిరిది సహజ మరణంగా చిత్రీకరించడానికి మొదట మంగ ప్రయత్నించింది. అయితే, మృతుడి తల్లి కాసారం నర్సమ్మ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా శరీరంపై గాయాలుండడంతో తన కుమారుడిని హత్య చేశారని గగ్గోలు పెట్టింది. భార్య, పిల్లలు, మరదళ్ల చేతిలో యాదగిరి హత్యకు గురైన ఉదంతం వెలుగుచూసింది.

బచ్చన్నపేట మండలం నక్కవానిగూడెం గ్రామానికి చెందిన యాదగిరికి శామీర్‌పేటకు చెందిన మంగతో 16ఏళ్ల క్రితం వివాహం జరిగింది. మద్యం కారణంగా తండ్రి బలికావడం, తల్లిసహా ఏడో తరగతి చదువుతున్న ప్రసాద్, ఆరో తరగతి చదువుతున్న ప్రవీణ్ లను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో వారి పరిస్థితి ఆ గమ్యగోచరంగా మారింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+