• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రైల్వేబడ్జెట్ 2013-14ముఖ్యాంశాలు, కొత్తలైన్లు & ఎపికి

By Srinivas
|

Pawan Kumar Bansa
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్ మంగళవారం మధ్యాహ్నం 2013-14 సంవత్సరానికిగాను రైల్వే బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశ పెడుతున్నారు. పార్లమెంటు భవన్‌కు చేరుకోవడానికి ముందు తనకు విషెస్ చెప్పిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పార్లమెంటులో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. కాగా, రవాణా ఛార్జీలు పెరుగుతాయనే ఆందోళన కారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు సెన్సెక్స్ 110 పాయింట్లు పడిపోయింది. బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో బన్సల్ మాట్లాడుతూ.. ఉన్నది లేనట్లుగా చెప్పడం తన ఉద్దేశ్యం కాదని, వాస్తవాన్ని చెబుతున్నానని అన్నారు. కాగా విపక్షాల నిరసనల మధ్య బన్సల్ తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం లోకసభ 2 గంటలకు వాయిదా పడింది.

బడ్జెట్ ముఖ్యాంశాలు...

- ప్రస్తుత బడ్జెట్ నాటికి రైల్వే నష్టం రూ.64,600 కోట్లు

- వచ్చే ఏడాది నాటికి 14 పాత వంతెనల పునర్నిర్మాణం

- రైల్వేలు ప్రమాద రహితంగా తీర్చిదిద్దాలనేది లక్ష్యం

- ఎ-1 స్థాయి స్టేషన్లలో 117 ఎస్కలేటర్లు, 400 లిఫ్ట్‌లు

- టిక్కెట్ల విక్రయాలలో అక్రమాల తగ్గింపుకు ఆధార్‌తో అనుసంధానం

- జోనల్ రైల్వేలో ప్రయాణీకుల భద్రతకు హెల్ప్ లైన్లు

- ఎస్సెమ్మెస్ ద్వారా రిజిస్ట్రేషన్ స్టేటస్ తెలుసుకునే అవకాశం

- మహిళల కోసం మరిన్ని కోచ్‌లు, హెల్ప్ లైన్ సెంటర్‌లు

- రైల్వేల నిర్వహణకు వనరుల వ్యయం పెరిగింది, ఆర్థికంగా భారతీయ రైల్వే నిలదొక్కుకోవాలి

- అలహాబాద్ ఘటన బాధించింది.

- 31,866 లెవల్ క్రాసింగ్‌ల ఆధునీకరణకు రూ.37వేల కోట్ల రూపాయలు కావాలి

- సమయాభావానికి అవకాశం లేకుండా డిసెంబరులోగా కొత్త ఈ-టికెటింగ్. దీనిని ఒకేసారి పదిలక్షల మంది వినియోగించుకోవచ్చు

- పర్యాటకుల కోసం ఢిల్లీ స్టేషన్ తరహాలు 7చోట్ల ప్రత్యేక ఏర్పాటు

- ఆరుచోట్ల రైల్ నీరు బాటిలింగ్ ప్లాంట్ల ఏర్పాటు

- కీలక ఘట్టాలైన నగరాలను కలిపేందుకు ఆజాద్ ఎక్స్‌ప్రెస్. ఆజాద్ ఎక్స్‌ప్రెస్ రైలులో యువతకు ప్రత్యేక రాయితీ

- మహిళా ప్రత్యేక రైళ్లకు మహిళా భద్రతా సిబ్బంది

- పరిశుభ్రత కోసం బయోటాయిటలింగ్ వ్యవస్థ

- ఆహార నాణ్యతకు ఐఎస్ఓ స్థాయి వంటకం

- ప్రయాణీకులకు సదుపాయాలు పెంచాలనే పట్టుదల

- పుణ్యక్షేత్రాలు ఉన్న రైల్వే స్టేషన్ల ఆధునీకీకరణ

- మధ్యప్రదేశ్ మిస్రాలో కోచ్‌‌ల ఆధునీకకరణ వర్క్ షాప్

- ఒరిస్సా కలహండిలో రైలు వాగన్‌ల వర్క్ షాప్

- మణిపూర్‌ను రైల్వేలో అనుసంధానం

- కత్రా - వైష్ణోదేవీ యాత్రికుల కోసం బస్సు - రైలులకు ఒకే టిక్కెట్

-1007 మిలియన్ టన్నుల సరుకు రవాణా లక్ష్యం

- వంద కోట్ల టన్నులకు పైగా రవాణాతో రష్యా, చైనా, అమెరికాలతో సమానంగా భారత్

- లెవల్ క్రాసింగులో సౌరశక్తి వినియోగం

- వెయ్యి కోట్లతో రైల్వే స్టేషన్ల అభివృద్ధి సంస్థ

- తుక్కు అమ్మకం ద్వారా రూ.4500 కోట్ల సేకరణ లక్ష్యం

- 47వేల బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి చర్యలు

- రైల్వే రక్షణ దళంలో మహిళలకు పదిశాతం రిజర్వేషన్

- ఇనుము, ఖనిజ రవాణా ద్వారా రూ.800 కోట్ల ఆదాయం

- 7చోట్ల రైల్వే కోచ్‌ల తయారీ కేంద్రాలు, నిర్వహణ కేంద్రాల ఏర్పాటు

- జోనల్ రైల్వేలో ప్రయాణీకుల భద్రతకు హెల్ప్ లైన్లు

- రైల్వే ఉద్యోగుల వసతి గృహాల సంఖ్య పెంపు, రూ.300 కోట్లు కేటాయింపు

- రైల్వేకు వచ్చే ఆదాయం అంచనా రూ.1,25,680

- రైల్వేలకు ప్రయాణీకుల ద్వారా వచ్చే ఆదాయం అంచనా రూ.32,500 కోట్లు

- రైల్వే భూముల అభివృద్ధి సంస్థకు రూ.1000 కోట్లు

- సౌర, పవన శక్తి వినియోగానికి రైల్వే ఇంధన నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు

- ఆర్థిక శాఖ నుంచి తీసుకున్న రూ.3వేల కోట్ల రుణానికి వడ్డీ చెల్లించాం

- 1500 కిలోమీటర్ల రవాణా ప్రత్యేక కారిడార్

- కొత్తగా 1.52 లక్షల ఉద్యోగాలు భర్తీ

- పురస్కారాలు పొందిన ప్రయాణీకులకు

- లెవల్ క్రాసింగ్ కేంద్రాలకు కేంద్రం నుండి అందుతున్న బడ్జెట్ రూ.వెయ్యి కోట్లు

- కోచ్‌ల పరిశుభ్రతకు ప్రత్యేకంగా కాల్ సెంటర్లు

- రైల్వేల్లో దుబారా తగ్గిస్తాం

- రిజర్వేష్, అభివృద్ధి, భద్రత రుసుంపై పునఃసమీక్ష

- 800 కి.మీ. మేర గేజ్ మార్పిడి

- రైల్వే ఛార్జీల సమీక్షకు స్వతంత్ర దర్యాఫ్తు సంస్థ ఏర్పాటు

- ప్రయాణీకుల రద్దీ 5.2 శాతం పెరుగుతుందని అంచనా

- డీజిల్ ధర పెంపు వల్ల రూ.3,300 కోట్ల భారం

- కొత్త రైలు మార్గాల ప్రతిపాదన నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం ఉచితంగా స్థలం ఇచ్చేందుకు అంగీకరించింది

- సాధారణ బడ్జెట్ నుండి రైల్వేల కేటాయింపులు రూ.26వేల కోట్లు

- రైల్వేలకు అంతర్గత ఆదాయం 14,260

- 22 కొత్త లైన్లు

- తత్కాల్ రిజర్వేన్ల ఛార్జీలు పెంచే ప్రతిపాదన

- కొత్తగా 27 ప్యాసింజర్ రైళ్లు, 67 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 58 రైళ్ల పొడిగింపు

- క్రీడారంగాల్లో అవార్డులు పొందిన వారికి ప్రత్యేక రాయితీ

- కొత్తగా 5 మెము రైళ్లు

ఎపికి ఇవే..

- విజయవాడలో కొత్త రైల్ నీరు బాటిలింగ్ ప్లాంట్

- కర్నూలులో రైల్వే వాగన్ వర్క్ షాప్

- విశాఖ స్టేషన్లో ప్రత్యేక సదుపాయాలు, విశాఖలో పర్యాటకులకు ఢిల్లీ తరహా ఏర్పాట్లు, విశాఖలో ఎగ్జిక్యూటివ్ లాంజ్

- కాజీపేటలో నైపుణ్యాల శిక్షణా కేంద్రం

- రైల్వేల్లో ఆర్థిక నిర్వహణ కోసం సికింద్రాబాదులో ప్రత్యేక శిక్షణా కేంద్రం

- సికింద్రాబాదులో రైల్వేల సమీకృత అభివృద్ధి శిక్షణా కేంద్రం

కొత్త రైల్వే లైన్లు, ప్రాజెక్టులు

కంభం - ప్రొద్దుటూరు

మణుగూరు - రామగుండం

కొండపల్లి - కొత్తగూడెం

రాయ్‌పూర్ - కాచిగూడ

డోర్నకల్ - మిర్యాలగూడ(డబ్లింగ్ ప్రతిపాదన)

చిక్‌బల్లాపూర్ - పుట్టపర్తి

మంచిర్యాల - అదిలాబాద్

మదనపల్లి - శ్రీనివాసపురం

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Railway Minister Pawan Kumar Bansal will present the Railway Budget 2013-14. He will be the first Congress minister in 17 years to present the railway budget. Bansal took over as the railway minister after the Trinamool Congress (TMC) withdrew its support from the UPA government on question of popular policies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more