ముఖేష్ అంబానీ ఇంటి ముందు కారు కలకలం, తనిఖీ

అక్కడ కాపలాకాస్తున్న సెక్యూరిటీ గార్డు వద్దని చెప్పినప్పటికీ సదరు వ్యక్తి గార్డు వ్యాఖ్యలను పట్టించుకోకుండా అక్కడే పార్క్ చేసి వెళ్లిపోయాడు. దీంతో గార్డుకు అనుమానం వచ్చింది. తన సీనియర్‌లకు సమాచారం అందించాడు. వెంటనే సెక్యూరిటీ గార్డులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే బాంబు నిర్వీర్య బృందం, డాగ్ స్క్వాడ్, పోలీసులు హుటాహుటిన కారు నిలిపి వేసిన ప్రాంతానికి చేరుకున్నారు. కారును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే, అందులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించారు. అదే సమయానికి కారు యజమాని అక్కడకు చేరుకున్నాడు. సమీపంలో ఉన్న వీనస్ అపార్టుమెంటులో ఒకరిని కలుసుకునేందుకు వచ్చానని అందుకే కారు అక్కడ నిలిపినట్లు చెప్పారు.
కాగా సోమవారం ఢిల్లీలోని రద్దీ ప్రదేశాల్లో ఒకటైన ధౌలా కౌన్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఇద్దరు యువకులు మోటార్ సైకిల్‌పై వచ్చి ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి సమీపంలో ఒక ల్యాప్‌టాప్ బ్యాగ్‌ను వదిలిపెట్టారని పోలీసులకు ఫోన్ రావడం, వెంటనే పోలీసులు అప్రమత్తమై బాంబుల జాడను పసిగట్టే శునకాలతో పాటు సైన్యంలోని బాంబు నిర్వీర్య దళాలు కూడా వెంటనే రంగంలోకి దిగి పరిశీలించడంతో ఇటుకలు, ల్యాప్ టాప్ వైర్లు కనిపించిన విషయం తెలిసిందే.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications