వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిల్‌షుక్‌నగర్ పేలుళ్లు: ఇద్దరి కస్టడీని కోరిన ఎన్ఐఎ

By Pratap
|
Google Oneindia TeluguNews

Dilsukhnagar Blasts
న్యూఢిల్లీ: హైదరాబాదులోని దిల్‌షుక్‌నగర్ బాంబు పేలుళ్లకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) ఇద్దరు అనుమానిత ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదుల కస్టడీని కోరింది. ఈ మేరకు ఎన్ఐఎ జిల్లా న్యాయమూర్తి ఎఎస్ మెహతా ముందు దరఖాస్తు పెట్టుకుంది. సయ్యద్ మక్బూల్‌ను, ఇమ్రాన్ ఖాన్‌ను తమకు అప్పగించాలని ఎన్ఐఎ న్యాయమూర్తిని కోరింది.

దీంతో ఇద్దరి కోసం న్యాయమూర్తి ప్రొడక్షన్ వారంట్స్ జారీ చేశారు. 2012 పూణే పేలుళ్ల కేసులో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు వారిద్దరిని అరెస్టు చేశారు. అప్పటి నుంచి వారు తీహార్ జైలులో ఉంటున్నారు. మక్బూల్‌ను, ఇమ్రాన్‌ను తమ ముందు బుధవారంనాడు హాజరు పరచాలని న్యాయమూర్తి తీహార్ జైలు అధికారులను ఆదేశించారు.

మక్బూల్, ఇమ్రాన్ 2012 జులైలో దిల్‌షుక్‌నగర్ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు ఎన్ఐఎ అనుమానిస్తోంది. పాకిస్తాన్‌లో ఉంటున్న ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ సూచన మేరకు వారిద్దరు రెక్కీ నిర్వహించారని ఎన్ఐఎ అనుమానిస్తోంది. వారిద్దరినీ విచారిస్తే దిల్‌షుక్‌నగర్ బాంబు పేలుళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియగలవని ఎన్ఐఎ భావిస్తోంది.

ఈ నెల 21వ తేదీన హైదరాబాదులోని దిల్‌షుక్‌నగర్‌లో జంట బాంబు పేలుళ్లు సంభవించాయి. ఇందులో 16 మంది మృతి చెందగా, వంద మందికి పైగా గాయపడ్డారు. వెంకటాద్రి, కోణార్క్ థియేటర్ల వద్ద ఈ పేలుళ్లు సంభవించాయి.

English summary
The NIA has moved a Delhi court seeking custody of two alleged operatives of banned terror outfit Indian Mujahideen to interrogate them in connection with the twin blasts in Hyderabad which claimed 16 lives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X