వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛార్జీలు పెంచొద్దని మావారికి చెప్పా: రైల్వే మంత్రి భార్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pawan Bansal
న్యూఢిల్లీ: రైల్వే ఛార్జీల పెంపు తనకు ఇష్టం లేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పవర్ కుమార్ బన్సల్ సతీమణి మధు బన్సల్ మంగళవారం అన్నారు. బన్సల్ ఈ రోజు రైల్వే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. దీనిపై ఆమె స్పందించారు. రైల్వే ఛార్జీలు పెంచడం తనకు ఇష్టం లేదని, రైళ్లలో మహిళల భద్రతకు ప్రత్యేక రక్షణ చట్టం చేపట్టాలని తాను తన భర్త పవర్ కుమార్ బన్సల్‌ను కోరానని చెప్పారు.

కాంగ్రెసు పార్టీకి చెందిన మంత్రి ఒకరు రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టడం పదిహేడేళ్ల తర్వాత జరుగుతోంది. 1997 నుండి 2004 వరకు ఎన్డీయే ప్రభుత్వం ఉండటం, ఆ తర్వాత భాగస్వామ్య పక్షాలతో యూపిఏ అధికారంలోకి వచ్చినా మిగిలిన పక్షాలు బడ్జెట్‌ను ప్రవేశపెట్టాయి. ఇప్పుడు బన్సల్ 17 ఏళ్ల తర్వాత తొలిసారిగా కాంగ్రెసు మంత్రిగా రైల్వే బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు.

సాధారణ రోజుల్లో ఏ ఎక్స్‌ప్రెస్‌లోనైనా కిక్కిరిసిపోని, ప్రయాణికులంతా సౌకర్యంగా కూర్చున్న జనరల్ బోగీని చూపించగలరా? రాబోయే మూడు నెలల్లోపు ఏ రోజైనా సరే, ఢిల్లీకి వెళ్లే ఏ ఎక్స్‌ప్రెస్‌లోనైనా సరే ఏసీ టికెట్ దొరుకుతుందా? సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వరకు... ఏ స్టేషన్‌లోనైనా ఈగలు ముసరని, మల మూత్రాల కంపు కొట్టని ఒక్క ప్లాట్‌ఫామ్‌ను చూపించగలరా? ఏ స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌పైన అయినా సరే, ధర ఎంతైనా సరే... కొంచెం రుచితో 'తినబుల్'గా ఉండే ఇడ్లీ వడ పూరీ దొరుకుతాయా? ఇవన్నీ బడ్జెట్‌లో తేలనున్నాయి.

కాగా, గతేడాది బడ్జెట్‌లో 175 కొత్త రైళ్లను ప్రకటించారు. ఈసారి వంద రైళ్లు ఇచ్చే అవకాశముంది. సేవల్లో ప్రమాణాలు, పరిశుభ్రతకు పెద్దపీట వేసే అవకాశం. కొత్త రాయితీలు లేకున్నా... జనాకర్షకంగానే బడ్జెట్. కీలకమైన రాష్ట్రాలకు కొత్తగా రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లు ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో చెల్లింపు-వినియోగం పద్ధతిలో టాయ్‌లెట్ల నిర్మాణం. కొన్ని కీలక ప్రాజెక్టులు, ప్రతిపాదనలను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వా మ్యం (పీపీపీ)తో చేపట్టే అవకాశం. విద్యుదీకరణ ద్వారా డీజిల్‌పై ఖర్చు రూ.500 కోట్ల వరకు తగ్గించుకునే ప్రయత్నం.

కొత్త మార్గాలను పక్కనపెట్టి... పెండింగ్‌లో ఉన్న వాటికి ప్రాధాన్య క్రమంలో నిధులు. ముంబైలో ఎలివేటెడ్ రైల్ కారిడార్, తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో ప్రత్యేక సరుకు రవాణా కారిడార్, బీహార్‌లో డీజిల్ లోకోమోటివ్ కేంద్రం, రాజస్థాన్‌లో రూ.వెయ్యి కోట్లతో మెము కోచ్ ఫ్యాక్టరీ! రైల్వే పనులకూ జాతీయ ఉపాధి హామీ అమలు! ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ప్రాజెక్టులు మంజూరు కాకపోవచ్చు. సికింద్రాబాద్, తిరుపతి రైల్వే స్టేషన్లలో వసతులను అంతర్జాతీయ స్థాయికి పెంచడంపై ప్రత్యేక శ్రద్ధ! నడికుడి-శ్రీకాళహస్తి, భద్రాచలం-కోవూరు లైన్లకు అధిక నిధులు రానున్నాయా చూడాలి.

English summary
Union Railway Minister Pawan Kumar Bansal has reached Rail Bhawan. He is set to present the Railway Budget 2013-14 in the Parliament on Tuesday amid expectations that several new trains and more passenger-friendly measures.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X