రైలు నుంచి తోసేశారు: భార్య మృతి, భర్తకు గాయాలు

Cops throw old couple off moving train, woman dead
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బుధవారం దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. వృద్ధ దంపతులను రైల్వే పోలీసులు కదులుతున్న రైలు నుంచి కిందికి తోసేశారు. ఎక్కాల్సిన రైలు కాకుండా మరో రైలు ఎక్కడంతో రైల్వే పోలీసులు వారిని తోసేశారు.

బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ముజఫర్‌నగర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. వారు మరో రైలు ఎక్కాల్సి ఉండగా శతాబ్ది ఎక్స్‌ప్రెసు రైలు ఎక్కారు. బాధితులు రాజేశ్వర్ త్యాగి, ఆయన భార్య సంతోష్ - ఇద్దరు కూడా 70 ఏళ్ల వయస్సు పైబడినవారే.

ఎక్కడికి వెళ్తున్నారని రైల్వే రిజర్వ్ పోలీసు విభాగానికి చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ రామచందర్, కానిస్టేబుల్ సుభాష్ ఆ దంపతులను అడిగారు.షహరన్‌పూర్ వెళ్తున్నట్లు వారు తెలిపారు. మీరు ఎక్కిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ అక్కడ ఆగదని చెప్పారు. దిగిపోవాలని రైల్వే పోలీసులు వారికి చెప్పారు. రైలు వేగం అందుకోవడంతో దిగలేమని దంపతులు చెప్పారు.

దాంతో ఆగ్రహించిన పోలీసులు కంపార్టుమెంట్ తలుపు తెరిచి, వారిద్దరిని బయటకు తోసేశారు. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలుకు సమాంతరంగా నడుస్తున్న రైలు మహిళను ఢీకొట్టింది. దీంతో ఆమె మరణించింది. త్యాగికి స్వల్పంగా గాయాలయ్యాయి. జిఆర్‌పికి చెందిన ఇద్దరు పోలీసులపై ముజఫర్‌నగర్ రైల్వే స్టేషన్‌లో కేసు నమోదైంది. శవపరీక్ష నిమిత్తం సంతోష్ మృతదేహాన్ని పంపించారు. త్యాగి వాంగ్మూలం మేరకు ఇద్దరు పోలీసులపై కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+