చాపర్ డీల్‌పై జెపిసి: సిగ్గుపడుతున్నానని ఆంటోనీ

జెపిసిలో 20 మంది లోకసభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. మూడు నెలల్లోగా జెపిసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. వివిఐపి చాపర్ డీల్ వ్యవహారంపై జరిగిన చర్చపై అంతకు ముందు రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ మాట్లాడారు. హెలికాప్టర్ కుంభకోణం దోషులను కఠినంగా శిక్షిస్తామని, తప్పు చేసిన కంపెనీని బ్లాక్ లిస్టులో పెడతామని ఆయన చెప్పారు. ఈ కుంభకోణం పట్ల తాను సిగ్గుపడుతున్నానని ఆయన అన్నారు.
ఏదో ఒక కుంభకోణం బయటపడుతూ ఉండడం మనకు సిగ్గు చేటైన విషయమని మంత్రి అన్నారు వాస్తవాలు తెలుసుకుంటామని, తప్పు చేసినవారిని శిక్షిస్తామని ఆయన చెప్పారు. కుంభకోణం మూలాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పన్ను చెల్లింపుదారుల డబ్బులు వృధా కాకూడదని అన్నారు.
కుంభకోణంపై విచారణకు ఆదేశించడంలో జాప్యం జరుగుతుండడాన్ని బిజెపి తప్పు పట్టింది. లంచాలు తీసుకున్నవారిని శిక్షించాలని డిమాండ్ చేసింది. డీల్ కోసం 400 కోట్ల రూపాయల లంచాలు చేతులు మారాయని బిజెపి సభ్యుడు ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఇటలీ పెట్టుబడిదారులు చెప్పిన కుటుంబం ఏదో దేశానికి తెలియాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications