హైకోర్టులో అత్యాచార బాధితురాలు ఆత్మహత్యాయత్నం

అయితే హైకోర్టులో విచారణ సమయానికి ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు హాజరు కాలేదు. దీంతో హైకోర్టు న్యాయమూర్తి ఆశిష్ దేశాయ్ కేసు విచారణను వాయిదా వేశారు. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి కోర్టు ఆవరణలో ఓ గదిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతిని పోలీసులు ప్రశ్నించారు. ఢిల్లీ యువతికి పట్టిన గతే నీకు పడుతుందంటూ నిందితుడు తనను భయపెడుతున్నాడని బాధిత యువతి పోలీసులకు తెలిపింది. అందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను ఆమె పోలీసులకు చూపించింది.
కాగా, గతేడాది డిసెంబరులో ఓ యువతి ఢిల్లీలో బస్సులోనే అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఆమెపై అత్యాచారం చేసిన నిందితులు ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించారు. అనంతరం ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications