పార్టీ పెట్టినందుకే జగనన్నను జైల్లో పెట్టారు: షర్మిల

కాంగ్రెస్ పార్టీ వదిలివెళ్లినందుకే జగన్ జైలు పాలు కావల్సివచ్చిందన్నారు. చిరంజీవి వియ్యంకుడి ఇంట్లో రూ.70కోట్లు దొరికినా సిబిఐ కేసు పెట్టలేదన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో పెద్ద మాఫియా డాన్‌గా మారినా ఆయనపై సిబిఐ కనీసం విచారణ కూడా చేయటంలేదన్నారు. గడిచిన ఉప ఎన్నికల్లో ఇదే కారంపూడి సెంటర్ నుంచి జగన్ ప్రసంగించి వెళ్లిన కొద్దిగంటలకే సిబిఐ విచారణ పేరిట పిలిచి అదుపులోకి తీసుకుందన్నారు.
జూలకల్లులో జరిగిన రచ్చ బండలో కూడా షర్మిల మాట్లాడారు. పాలించే రాజు మంచివాడైతే దేవుడు దయ కూడా ఉంటుదని, వర్షాలు సకాలంలో పడుతాయని, పంటలు పండుతాయని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి సువర్ణ పాలనలో వర్షాలకు కొదువ లేదని, పంటలు బాగా పండాయని, రైతన్నలకు మద్దతు ధర పలికిందని, వైయస్ మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత మన రాష్ట్రాన్ని పాలకులు నాసనం చేస్తున్నారని ఆమె అన్నారు.
మంచి రోజుల మళ్లీ వస్తాయని, జగనన్న త్వరలోనే బయటకు వస్తారని ఆమె అన్నారు. రాజన్న ఇచ్చిన ఉచిత విద్యుత్తును కొనసాగిస్తారని, అప్పుడు 9 గంటల ఉచిత విద్యుత్తు అందుతుందని షర్మిల అన్నారు. రైతులు విలువైన భూములు అమ్ముకోవద్దని, అంతకన్నా విలువైన ప్రాణాలు తీసుకోవద్దని ఆమె సలహా ఇచ్చారు.












Click it and Unblock the Notifications