కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిరూపిస్తే దేనికైనా రెడీ: బాబ్లీపై ఎర్రబెల్లి సవాల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Errabelli Dayakar Rao
కరీంనగర్: తమ పార్టీ ప్రభుత్వ హయాంలో మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై బాబ్లీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందని నిరూపిస్తే తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ చేశారు. బాబ్లీ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాబ్లీపై సుప్రీంకోర్టు తీర్ప వల్ల ఉత్తర తెలంగాణలోని భూములన్నీ ఎడారులుగా మారే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బాబ్లీ అంశం నేపథ్యంలో తెలుగుదేశం తెలంగాణ ఫోరం శుక్రవారంనాడిక్కడ సమావేశమైంది. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఎడారిగా మారకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తక్షణమే అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. రాష్ట్రానికి న్యాయం జరగాలంటే ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.

శ్రీరాంసాగర్ వరద కాలువ ప్రాజెక్టును (ఎస్పారెస్పీని) కాపాడేందుకు ప్రజా ఉద్యమాలు చేస్తామని ఆయన చెప్పారు. ఉద్యమ కార్యాచరణను కూడా ఆయన ప్రకటించారు. ఈ నెల 4వ తేదీన ఎస్సారెస్పీ పరిధిలోని అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ నెల 7వ తేదీన నిజామాబాద్ కలెక్టరేట్ ముందు, 8వ తేదీన ఆదిలాబాద్, కరీంనగర్ కలెక్టర్ కార్యాలయాల ముందు, 9వ తేదీన నల్లగొండ, వరంగల్ కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తామని ఆయన చెప్పారు. రైతు సంఘాలను, రాజకీయ పార్టీలను కలుపుకుని తాము ప్రజా ఉద్యమాలు చేస్తామని ఆయన చెప్పారు.

English summary
Telugudesam Telangana forum convener Errabelli Dayakar Rao said that the Babli project has not been designed by Maharashtra in TDP regime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X