హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాగం కొత్త తెలంగాణ పార్టీ: కెసిఆర్‌ను ఢీకొంటారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao-Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుపై గత కొద్ది కాలంగా తీవ్ర విమర్శలు చేస్తున్న తెలంగాణ నగారా సమితి నాయకుడు, శానససభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి కొత్త తెలంగాణ పార్టీని స్థాపింబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రకటించారు. ఉద్యమం కోసమే పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసే వారికి సీట్లు ఇస్తామని ఆయన చెప్పారు.

ఎన్డీయెతో కలిసి తెలంగాణ ఏర్పాటుకు ముందుకు పోతామని కూడా ఆయన అన్నారు. ఇదే సందర్భంలో మరోసారి కెసిఆర్‌పై ఆయన విరుచుకుపడ్డారు. తెరాస నుంచి సస్పెన్షన్‌కు గురైన ఓ పార్టీ నాయకుడిని ఆయన హైదరాబాదులోని హస్తినాపురంలో పరామర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసేవారిని కలుపుకుని వెళ్లడంలో కెసిఆర్ తీరు సరిగా లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాజకీయ జెఎసిని కెసిఆర్ నీరు గారుస్తున్నారని ఆయన విమర్శించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కెసిఆర్ సీట్లను అమ్ముకున్నారని తెలంగాణ ప్రజా సంఘాల జెఎసి చైర్మన్ గజ్జెల కాంతం ఆరోపించారు. 2014 ఎన్నికల్ోల కెసిఆర్ భవిష్యత్తును తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారని ఆయన శక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలను తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు బహిష్కరించాలని ఆయన కోరారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే కెసిఆర్ ఫామ్‌హౌస్‌లో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

తెలుగుదేశం నుంచి బయటకు వచ్చిన నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ నగారా సమితిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో నాగర్‌కర్నూలు నియోజకవర్గం నుంచి తిరిగి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో నాగం జనార్దన్ రెడ్డికి తెరాస మద్దతు ఇచ్చింది. అయితే, ఇటీవల కొద్ది కాలంగా నాగం జనార్దన్ రెడ్డి కెసిఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ స్థితిలో ఆయన పార్టీ స్థాపిస్తానని ప్రటించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

English summary
Nagam Jana Reddy has decided to launch new Telangana party to counter Telangana Rastra Samithi (TRS) president K chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X