హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫొటోలు: 2014 ఎన్నికల్లో పార్టీల సారథులు వీరే..

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వచ్చే ఎన్నికలకు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఇప్పటికే సిద్ధపడుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఎత్తులు, పొత్తులపై ఎన్నికల సమయంలో ఆలోచించుకోవచ్చుననే ఉద్దేశంతో ఉన్న ప్రధార రాజకీయ పార్టీలు సొంత ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నట్లే కనిపిస్తున్నాయి. ఇటీవలి వరకు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారా లేదా అనే అనుమానం పొడసూపుతూ వచ్చింది. సహకార ఎన్నికల తర్వాత ఆయన బలోపేతం అయినట్లు కనిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల వరకు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉంది. ఆయనే వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ తరఫున సారథ్యం వహించే అవకాశాలున్నాయి.

జైలు నుంచే కథ నడిపిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వచ్చే ఎన్నికలనాటికైనా బయటకు వస్తారా, లేదా అనే సందేహం నెలకొని ఉంది. అయితే, తమ నేత తప్పకుండా జైలు నుంచి బయటకు వస్తారని, పార్టీని విజయపథాన నడిపిస్తారని, ముఖ్యమంత్రి కూడా అవుతారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. ఇతర పార్టీల శానససభ్యులను దండిగా పార్టీలో చేర్చుకుంటున్న వైయస్ జగన్ వచ్చే ఎన్నికల్లో ఎవరెవరికి టికెట్లు ఇస్తారనేది ఆసక్తికరంగానే మారింది.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవడానికి పాదయాత్ర చేస్తున్నారు. జనవరి 26వ తేదీ వరకు అనుకున్న పాదయాత్రను ఆయన మరింత పొడిగించారు. తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికల కోసం సమాయత్తం చేయడానికి తగిన ఊపును ఆయన పాదయాత్ర ద్వారా ఇవ్వాలని అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీని ఎన్నికల్లో ఆయన నడిపించాల్సిందే.

ఫోటోలు: ఎన్నికల సారథులు వీరే...

కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిపై ఊగిసలాట తొలగినట్లే. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి రాష్ట్రంలో ఆయనే సారథ్యం వహించే అవకాశం ఉంది. ఆయనకు తోడుగా, కేంద్ర మంత్రి చిరంజీవి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రధాన పాత్రలు పోషించే అవకాశం ఉంది. సహకార ఎన్నికల్లో అనుసరించిన వ్యూహం ఫలించిందని కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ భావిస్తున్నారు. అదే రీతిలో కలిసికట్టుగా నాయకులంతా పనిచేస్తే వచ్చే ఎన్నికలను ఈదడం కష్టమేమీ కాదని కాంగ్రెసు సీనియర్ నేతలు అంటున్నారు.

ఫోటోలు: ఎన్నికల సారథులు వీరే...

తెలుగుదేశం పార్టీ ఓడినా, గెలిచినా బాధ్యత అంతా చంద్రబాబు నాయుడిదే. అందుకే, ఆయన తీవ్రమైన శ్రమకోర్చి పాదయాత్ర చేస్తున్నారు. ఆయనకు వచ్చే ఎన్నికల్లో ప్రచార సారథులుగా, సలహాదారులుగా తనయుడు నారా లోకేష్, బావమరిది బాలకృష్ణ పనిచేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి వస్తారా, లేదా అనేది సందేహమే. నందమూరి హరికృష్ణ ఇంకా అంటీ ముట్టనట్లే ఉంటున్నారు.

ఫోటోలు: ఎన్నికల సారథులు వీరే...

వైయస్ జగన్ పరిస్థితి విచిత్రమైంది. జైలు నుంచి ఎప్పుడు బయటపడుతారో తెలియని స్థితి. ఆయన జైలు నుంచి బయటకు వస్తే అంతా ఆయనే అయి వ్యవహరిస్తారు. ప్రచార సారథి ఆయనే అవుతారు. ఆయన జైలు నుంచి రాకపోతే ఆ బాధ్యతను వైయస్ విజయమ్మ, షర్మిల మోయడానికి సిద్ధంగా ఉన్నట్లే కనిపిస్తున్నారు.

ఫోటోలు: ఎన్నికల సారథులు వీరే...

కెసిఆర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తన పార్టీకి అత్యధిక స్థానాలు సంపాదించుకోవడానికి విశేషంగా పర్యటించే అవకాశం ఉంది. ఆయనకు ప్రచారంలో విజయశాంతి, కెటి రామారావు, హరీష్ రావు, కవిత సహకరించవచ్చు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు వచ్చే ఎన్నికల కోసమే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ ఇవ్వదని ఆయన గట్టిగానే నమ్ముతున్నారు. దీంతో ఆయన వచ్చే ఎన్నికలకు పార్టీ నాయకులను సమాయత్తం చేస్తున్నారు. అందుకు అనుగుణమైన వ్యూహాలను అనుసరిస్తున్నారు. తెరాస విజయాపజయాలు కూడా కెసిఆర్‌పైనే పూర్తిగా ఆధారపడి ఉన్నాయి.

ఇక, బిజెపి, సిపిఐ, సిపిఎంలు కూడా వచ్చే ఎన్నికలకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లే. బిజెపి ఒంటరిగానే పోటీ చేస్తుందా, తెరాసతో జత కడుతుందా అనేది ఎన్నికల సమయానికి గానీ తెలియదు. సిపిఐ ఇటు తెలుగుదేశం పార్టీతోనూ అటు తెరాసతోనూ దోస్టీ కట్టేందుకు సముఖంగా ఉన్నట్లు అర్థమవుతోంది. సిపిఎం వైయస్సార్ కాంగ్రెసుతో వెళ్లే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

ఈలోగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలాబలాలను తేల్చుకోవడానికి ఈ పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చే ఫలితాలు 2014 శాసనసభ, లోకసభ ఎన్నికలను ప్రభావితం చేస్తాయని అంటున్నారు.

English summary
The main political parties leaders Liran kumar Reddy, Nara Chandrababu Naidu, YS jagan and K Chandrasekhar Rao are preparing to face 2014 elections. CM Kiran kumar Reddy may lead Congress party in ensuing general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X