అనిల్‌కు క్యారెక్టర్ లేదు, రవీంద్రనాథ్ అరాచకాలు: బాబు

Chandrababu Naidu
విజయవాడ: వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేరుపేరునా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని వాటాలేసుకుని తింటున్నారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని దోచుకుతినటం వైయస్ నేర్పగా, కిరణ్ ఆ పాలసీని చక్కగా అమలు చేస్తున్నారని విమర్శించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం వేములపల్లి వద్ద ఆయన శుక్రవారం పాదయాత్రను ఆయన ప్రారంభించారు.

కొడాలి సెంటర్‌లో జరిగిన బహిరంగసభలో కాంగ్రెస్ నేతలను తూర్పారపడ్డారు. మురుగుకాల్వల్లోని గుర్రపుడెక్క తొలగించటం ఎంత కష్టమో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అవినీతిని అరికట్టడం అంత కష్టమని తెలిపారు. మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ వాటాలుగా దోచుకుతింటున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ ఇద్దరు తమ్ముళ్లు రాష్ట్రాన్ని చెరోపక్క నుంచి దోచుకుంటున్నారని విమర్శించారు. వారికి డబ్బులు ఇవ్వనిదే ఏ ఫైలూ కదలటంలేదన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి బంధువులు దేశంపై పడ్డారని మండిపడ్డారు. "కేరెక్టర్ లేని అనిల్ కుమార్ క్రైస్తవ మతాన్ని కించపరుస్తున్నారు. బయ్యారం గనులు, హైదరాబాద్‌లో వందల కోట్లు విలువైన భూములు కబ్జాచేశారు. వైఎస్ బావమరిది, మాజీ మేయర్ కడపలో అరాచకాలు చేస్తున్నారు.ఫోర్జరీ సంతకాలు చేసిన కేసులో ఆయనను పోలీసులు విచారిస్తున్నారు. వైఎస్ బతికిఉండగానే భారీగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన ఘనత ఆయనదే. ఏ ముఖ్యమంత్రి కొడుకూ చేయని అరాచకాలు జగన్ చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దొంగ కన్నీళ్లు పెట్టి జనం సొమ్ము దోచుకున్నారు'' అని విరుచుకుపడ్డారు.

పెట్రోలు ధరలను మళ్ళీ పెంచటం దారుణమన్నారు. మొవ్వలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లు రాయబారాలు నడుపుకుంటూ చీకటి ఒప్పందాలకు సిద్ధమయ్యాయని, నేడ.రేపో ఏదో ఒకరోజు ఆ రెండు పార్టీలు కలవటం తథ్యమని చంద్రబాబు అన్నారు. వైకుంఠపాళిలో తన కుమారుడిని నిచ్చెన ఎక్కించి ప్రజలను పాములకు పట్టించిన ఘనుడు వైయస్ అని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీకి హైకమాండ్ అనేది లేదనీ, ప్రజలే హైకమాండ్ అని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+