ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారు, ఎదుర్కుంటాం: అసద్

వచ్చే ఎన్నికల్ోల కాంగ్రెసు పార్టీకి ఓట్లతో సమాధానం చెప్తామని ఆయన అన్నారు. దిల్‌షుక్‌నగర్ పేలుళ్ల ఘటనను ఆయన దేశంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఉగ్రవాదులకు మతం లేదని, వారిపై జాలి చూపాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
కాగా, అనారోగ్య కారణాలతో శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆరురుగు శానససభ్యులు, ఇద్దరు ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెసు పార్టీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత మజ్లీస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తోంది.
ద్వేషపూరిత వ్యాఖ్యలకు గాను మజ్లీస్ శాసనసభ్యుడు నిర్మల్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాంగ్రెసుతో తెగదెంపులు చేసుకున్న మజ్లీస్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో దోస్తీ కట్టేందుకు సిద్ధపడినట్లు విశ్వసిస్తున్నారు.












Click it and Unblock the Notifications