సిబిఐ జెడి కాల్ డేటా లీక్: సుప్రీం నోటీసులు

వివి లక్ష్మినారాయణ ఫిర్యాదు మేరకు కాల్ డేటా లీక్ వ్యవహారంపై సిఐడి దర్యాప్తు ప్రాంరభించింది. కొందరు స్వార్థపరులు కావాలని తన టెలిఫోన్ కాల్స్ వివరాలను లీక్ చేశారని ఆయన ఆరోపించారు. దీంతో రఘురామ రాజు, ఎంవి రమణారావు తదితరులపై సిఐడి కేసులు నమోదు చేసింది.
వాన్‌పిక్ కేసులో నిందితుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ నిమ్మగడ్డ ప్రసాద్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి అనుచరుడు స్వస్తిక్ నాగరాజును సీబీఐ అరెస్టు చేసింది. గురువారం ఆయన్ను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. సిబిఐ కోర్టులో హాజరుపర్చారు.












Click it and Unblock the Notifications