కెవిపి అడ్డుకుంటున్నారు: యాష్కీ, తొడ కొట్టారు: జెసి

Madhu Yashki-JC Diwakar Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు అడుగడుగునా అడ్డుకుంటున్నారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ విమర్శించారు. తెలంగాణను అడ్డుకునే ఆంధ్ర ప్రాంత నేతల ఇళ్ల ముందు సడక్ బంద్ నిర్వహించాలని ఆయన తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్‌కు సూచించారు. అప్పుడే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని ఆయన అన్నారు.

శనివారంనాడు హైదరాబాద్ వచ్చిన ఆయన కొద్దిసేపు శంషాబాద్ విమానాశ్రయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలావుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానం దమ్ము ఎంతో గతంలోనే చూశామని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కునే దమ్ము తమకు ఉందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అందుకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తొడ కొట్టారని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రభుత్వంపై మళ్లీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని అనడం ప్రతిపక్షాల అవివేకమని ఆయన అన్నారు. అవిశ్వాసం ప్రతిపాదిస్తే ఎదుర్కుంటామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన అభినందనీయమని ఆయన అన్నారు. పార్టీ శానససభ్యులపై నమ్మకం ఉందని, మెజారిటీ నిరూపించుకోవడానికి అభ్యంతరం లేదని జెసి అన్నారు. కొందరు శాసనసభ్యులు చేసిన రాజీనామాలను ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారని, శాసనసభ్యులతో మాట్లాడిన తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు.

గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టుపై అవగాహన లేకుండా పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గోదావరి నదిపై చెక్ డ్యాం పేరుతో మహారాష్ట్ర అక్రమంగా 13 అక్రమ జలాశయాలు నిర్మించిందని ఆయన శనివారం మీడియాతో అన్నారు.

మంచినీటి కోసం రెండు టిఎంసిల నీటిని వాడుకోవడానికి డ్యామ్‌లు కట్టుకున్నామని చెబుతూ బాబ్లీ ప్రాజెక్టు పేర వందల టిఎంసిల నీటిని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. బాబ్లీ ప్రాజెక్టు వల్ల నష్టం లేదని ముఖ్యమంత్రి సహా పలువురు నేతలు మాట్లాడడడం అవగాహనా రాహిత్యమేనని ఆయన అన్నారు. బాబ్లీని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన సూచించారు. మహారాష్ట్రకు కావాల్సిన మంచినీటిని కేంద్రమే ఇవ్వాలని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+