జగన్‌ను ఎదుర్కునే దమ్ము కిరణ్ రెడ్డికి లేదు: విహెచ్

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, వికేంద్రీకరణ లేకుండా పోయాయని, ముఖ్యమంత్రి ఎప్పుడు ఏమి ప్రకటిస్తారో, పిసిసి అధ్యక్షుడు ఏ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారో తెలియకుండా పోయాయని ఆయన అన్నారు. ఎన్నికలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి లేదా పిసిసి అధ్యక్షుడు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఏ సీనియర్ నాయకుడినీ వారు సంప్రదించటం లేదని తెలిపారు. మొక్కుబడిగా సమావేశాలు ఏర్పాటు చేసి ఊరుకుంటున్నారని వీహెచ్ చెప్పారు.
వలస వెళ్లేవారిని ఆపేందుకు ఏ నాయకుడూ ప్రయత్నించటం లేదన్నారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ విజయం సాధించాలన్న అభిప్రాయమే ముఖ్యమంత్రి లేనట్లు కనబడుతోందని చెప్పారు. రాష్ట్రంలో పార్లమెంటు సభ్యులకు విలువ ఇవ్వడం లేదని ఆయన అన్నారు.
ఇటీవల ప్రధానమంత్రి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తనను, ఇతర పార్టీ సీనియర్ నేతలను పోలీసులతో వెనక్కు నెట్టివేయించారని హనుమంతరావు విమర్శించారు.












Click it and Unblock the Notifications