మోస్ట్ పాపులర్ సిఎం: మోడీపై రాజ్‌నాథ్ ప్రశంసలు

బిజెపి జాతీయ మండలి సమావేశంలో ఆయన శుక్రవారం ఆయన మాట్లాడారు. ఒకే నాయకత్వంపై బిజెపి మూడు సార్లు పార్టీ విజయం సాధించడం అంతకు ముందు ఎన్నడూ జరగలేదని అన్నారు. నాయకులు, కార్యకర్తలు తలపెట్టిన సన్మానాన్ని స్వీకరించడానికి మోడీ హర్షధ్వానాల మధ్య వేదికపైకి చేరుకున్నారు. కేవలం మాటలతో మోడీని వేదికమీదికి అహ్వానించడం సరిపోదని, పెద్ద యెత్తున హర్షధ్వానాలు అవసరమని, నిలబడి అభినందించాలని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
ప్రభుత్వాలను విజయవంతంగా నడుపుతున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఛత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి రమణ సింగ్‌ను కూడా ఆయన అభినందించారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరిక్కర్‌ను, బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీని కూడా ఆయన కొనియాడారు.
తన సమీప భూత పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి ఆయన అండగా నిలిచారు. గడ్కరీపై ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఆయన అన్నారు. యుపిఎ ప్రభుత్వం పలు రంగాల్లో విఫలమైందని ఆయన విమర్శించారు. ఉగ్రవాదాన్ని అదుపు చేయడంలో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ విఫలమయ్యారని ఆయన అన్నారు. ఆర్థిక రంగంలో గాడిలో పెట్టడంలో కూడా యుపిఎ విఫలమైందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications