హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసదుద్దీన్ అరెస్ట్, విడుదల: పేలుళ్లు భారత్‌పై దాడే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Asaduddin Owaisi
బెంగళూరు: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీని కర్ణాటక పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. బీదర్ జిల్లాలో జరుగుతున్న నగర పాలక ఎన్నికల్లో మజ్లిస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థికి మద్దతుగా అసదుద్దీన్ ఓవైసీ శనివారం ప్రచారం నిర్వహించారు.

ముందస్తు అనుమతి లేకుండా ఆయన మైక్ ఉపయోగించారంటూ స్థానికంగా ఫిర్యాదు రావడంతో పోలీసులు రంగంలో దిగి అసదుద్దీన్ ఓవైసీని హుమ్నాబాద్ చెక్‌పోస్ట్ సమీపంలో అరెస్టు చేశారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తు పైన అతనిని విడుదల చేశారు.

కాగా అంతకుముందు అసద్ హైదరాబాదులో మాట్లాడుతూ... లౌకిక పార్టీలకు చెందిన వ్యక్తే ప్రధాని అయ్యేందుకు మజ్లిస్ ప్రయత్నిస్తుందని చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కనికరం లేనివాడని మండిపడ్డారు. ప్రధాని ఎవరు కావాలనే అంశాన్ని దళితులు, బిసిలు, ముస్లింలు నిర్ణయిస్తారని చెప్పారు. బిజెపికి తానంటే ఇష్టం లేదని, తన ముఖం కూడా వారికి ఇష్టం లేదన్నారు. ఒవైసీ వ్యాఖ్యల వల్లే పేలుళ్లు జరిగాయని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు.

దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లు జరిగిన గంటలోనే వీటిని ఫలానా వ్యక్తి చేశారంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయని, హిందూ-ముస్లింల మధ్య చిచ్చు పెట్టడానికే ఇలా చేశాయని, మీడియా, పోలీసు వ్యవస్థల్లో మత ఛాందసవాదులు కీలక పాత్ర పోషిస్తున్నారని, మజ్లిస్‌ను బద్నామ్ చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారని, లష్కరేతో సంబంధాలు అంటగడుతున్నారని, సంబంధాలుంటే నిరూపించాలని అసద్ సవాల్ విసిరారు.

దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో మక్కా మసీదు కేసులో బాధితులను కూడా విచారిస్తున్నారని, ఆ పేలుళ్లలో వారి పాత్ర ఏమీ లేదని సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత విచారణల పేరిట వేధించడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. ఉగ్రవాదానికి మతం లేదని, మనుషులు చేసే పనేనా అంటూ దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లను ఖండించారు. ఈ పేలుళ్లను మొత్తం భారతదేశంపై, ప్రజలపై జరిగిన దాడి అని అభివర్ణించారు.

English summary
MIM president and MP Asaduddin Owaisi was arrested by the Karnataka police near Humnabad in Bidar district for allegedly defying prohibitory orders on Saturday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X