హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నికలకే, మంత్రిగా కెసిఆర్: కవిత వర్సెస్ తుమ్మల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tummala Nageswara Rao-Tummala Nageswara Rao
హైదరాబాద్: బాబ్లీ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీల మధ్య వివాదం ముదిరింది. బాబ్లీ పాపం తెలుగుదేశం పార్టీదేనని, ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమయిందని తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. బాబ్లీ నిర్మాణ సమయంలో తుమ్మల నాగేశ్వర రావు మంత్రిగా ఉన్నారని, ఆయన అప్పుడేం చేశారని కెసిఆర్ ప్రశ్నించారు. దీనిపై టిడిపి నేత తుమ్మల నాగేశ్వర రావు స్పందించారు. కెసిఆర్ కేంద్రమంత్రిగా ఉండగానే బాబ్లీ నిర్మాణం జరిగిందని అప్పుడు కెసిఆర్ ఏం చేశారని తుమ్మల ప్రశ్నించారు. సుప్రీం కోర్టు ఆపమని చెప్పినా మహారాష్ట్ర బాబ్లీ గేట్ల నిర్మాణం ఆపలేదన్నారు. బాబ్లీ విషయంలో టిడిపి చిత్తుశుద్ధితో పోరాటం చేస్తోందని అన్నారు.

టిడిపి వ్యాఖ్యలపై తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవిత స్పందించారు. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో నష్టం జరిగితే తప్పకుండా ఉద్యమిస్తామన్నారు. ఎన్నికల కోసమే బాబ్లీ అంశాన్ని టిడిపి ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పై టిడిపి నేతలు ఎందుకు పెదవి విప్పడం లేదన్నారు. పోలవరంకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ఆమె చెప్పారు.

పోలవరం టెండర్లపై పిటిషన్ వాయిదా

పోలవరం టెండర్లు ట్రాన్స్‌ట్రాయ్ సంస్థకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిపై కోర్టు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత విచారణ చేపట్టింది. దీనిపై ఉన్నతస్థాయి కమిటీ నివేదికను సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభత్వాన్ని ఆదేశించింది. అనంతరం కేసును ఈ నెల 11వ తేదికి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌ను సోమా కంపెనీ వేసింది.

English summary
Telugudesam Party senior leader Tummala Nageswara Rao has blamed TRS chief K Chandrasekhar Rao on Babli issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X