చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నికలకు సిద్ధంకండి: నారా లోకేష్, జగన్ పార్టీపై ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nara Lokesh
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన శుక్రవారం మండిపడ్డారు. నారా లోకేష్ చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు రెండో రోజు. ఆయన పల్లె పల్లెకు తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పూర్తి అవినీతి పార్ట అని ధ్వజమెత్తారు. ఆ పార్టీని గెలిపిస్తే రాష్ట్రానికి నష్టమేనని అభిప్రాయపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు అవినీతి పార్టీ అయితే, కాంగ్రెసు అసమర్థ పార్టీ అన్నారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, తిరిగి గాడిలో పడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలు టిడిపిని అందలమెక్కిస్తే రాష్ట్రం తిరిగి అభివృద్ధిలో పుంజుకుంటుందన్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళలపై యాసిడ్ దాడులు జరుగుతున్నాయన్నారు. సరైన రక్షణ కల్పించలేకపోతున్నారని ఆరోపించారు.

రాజకీయాల్లో సామాజిక న్యాయం పాటించిన ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమే అన్నారు. టిడిపి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్తుందన్నారు. గత 2009 ఎన్నికల్లో చంద్రబాబును ఓడించేందుకు కాంగ్రెసు పార్టీ రూ.25 కోట్లు ఖర్చు పెట్టిందని, అయినా గెలువలేకపోయిందన్నారు. పార్టీ కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో బిసిలకు వంద స్థానాలు ఇస్తామని, అధికారంలోకి వస్తే పదివేల కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెడతామన్నారు.

అవిశ్వాసంపై సలహాలు వద్దు

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే విషయంలో తమకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సలహాలు అవసరం లేదని కోడెల శివప్రసాద్ వేరుగా హైదరాబాదులో అన్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుండి బయటకు వచ్చేందుకే అవిశ్వాసం నాటకం ఆడుతున్నారని విమర్శించారు. దోపిడీలో జగన్ ఎ1 అయితే, బ్రదర్ అనిల్ ఎ2 అన్నారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu's son Nara Lokesh has lashed out at YS Jaganmohan Reddy's YSR Congress Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X