వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాప్20 వుమెన్: సోనియా, సైనానెహ్వాల్, ఐశ్వర్యరాయ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Top 20 leading Indian women: Surveay
న్యూఢిల్లీ: భారత దేశంలో అత్యంత ప్రముఖులైన మహిళల్లో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌లకు చోటు దక్కింది. అసోచాం-జీ బిజినెస్ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో దేశంలో అత్యంత ప్రముఖ మహిళలపై సర్వే చేశారు. ఈ సర్వేలో సోనియా గాంధీ మొదటి స్థానంలో నిలిచారు. సైనా నెహ్వాల్ తొమ్మిదో స్థానంలో నిలిచారు.

ఐసిఐసిఐ మేనేజింగ్ డైరెక్టర్ కమ్ సిఈవో చందాకొచ్చార్, పెప్సీకో సిఈవో ఇంద్రనూయిలు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఈ రోజు(శుక్రవారం) మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలపై సర్వే చేశారు. టాప్ 20 మహిళలు-2012 పేరుతో ఈ అధ్యయనం చేశారు. గురువారం వివరాలు వెల్లడించారు.

ఢిల్లీ, ముంబయి, అహ్మదాబాద్, కొచ్చిన్, బెంగళూరు, హైదరాబాద్, ఇండోర్, పాట్నా, పూణే, చండీగఢ్, డెహ్రాడూన్ తదితర నగరాలలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ అధ్యయనం చేశారు. కార్పోరేట్ స్థాయి ఉద్యోగులను సర్వే కోసం ఎంపిక చేసుకున్నారు. వీరిలో అత్యధికులు ఇరవై నుండి ముప్పయ్యేళ్ల సంవత్సరాలు మధ్య వారే.

టాప్ ట్వంటీలో వరుసగా.. సోనియా గాంధీ, చందాకొచ్చార్, ఇంద్రనూయి, కిరణ్ మంజుదార్ షా, ఐశ్వర్య రాయ్ బచ్చన్, శిఖాశర్మ, విద్యాబాలన్, మేరీకోం, సైనా నెహ్వాల్, కిరణ్ బేడీ, నైనాలాల్, కిద్వాయ్, స్వాతి పిరామల్, షబానా అజ్మి, ఏక్తాకపూర్, జోయా అక్తర్, సుష్మా స్వరాజ్, జయలలిత జయరామ్, మమతా బెనర్జీ, మీరా కుమార్, దింపుల్ యాదవ్‌లు వరుసగా ఒకటి నుండి ఇరవై స్థానాల వరకు నిలిచారు.

English summary
Chanda Kochchar, Indra Nooyi, Aishawarya Rai Bachchan, Sonia Gandhi and Saina Nehwal the most popular indian women, reveals a comprehensive survey released on eve of Women's day by Assocham-Zee Business to asertain the leading women of India in 2012.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X