హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఢిల్లీలో హైదరాబాద్ యువతిపై సహోద్యోగుల కీచకపర్వం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Woman molested in New Delhi
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో అత్యాచారాల పరంపర కొనసాగుతోంది. హైదరాబాదుకు చెందిన ముప్పై ఏళ్ల యువతిపై ఆమె సహోద్యోగులే అఘాయిత్యానికి పాల్పడిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్గావ్‌లోని ఒక ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మహిళ బుధవారం రాత్రి ఏడు గంటలకు కార్యాలయం నుండి ఇంటికి బయలుదేరింది.

ఇంటివద్ద దిగబెడతానని అనటంతో తన సహోద్యోగి కారులో ఆమె కూర్చుంది. అదే కారులో మరో ఇంకో ఉద్యోగి కూర్చున్నాడు. అయితే, వీరిద్దరు అమెను ఇంటి వద్ద దిగబెట్టకుండా గుర్గావ్ రోడ్లపై తిప్పుతూ యువతిపై కారులోనే అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను రోడ్డు పైనే వదిలేసి వెళ్లిపోయారు. నిందితులిద్దరి పైన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

రేప్ బిల్లుపై భిన్నాభిప్రాయాలు

మరోవైపు నేర నిరోధక చట్టం సవరణ బిల్లుపై పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య భిన్నాభిప్రాయాలు, వ్యతిరేకతల నేపథ్యంలో ఈ బిల్లుపై మంత్రివర్గ సమావేశంలో చర్చ వాయిదా పడింది. ఢిల్లీలో యువతిపై సామూహిక అత్యాచార ఘటన నేపథ్యంలో ఫిబ్రవరి 3న మహిళలపై అత్యాచార నిరోధక ఆర్డినెన్సును జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో పూర్తి స్థాయిలో నేర నిరోధక చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.

ఈ బిల్లు ముసాయిదాపై గురువారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో చర్చించాల్సి ఉంది. అయితే.. నేరస్థుల మైనారిటీ వయస్సును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని కేంద్ర హోంశాఖ సూచించింది. అత్యాచారం అనే పదాన్ని ఉపయోగించడం కంటే లైంగిక దాడి అంటే స్త్రీ, పురుషులు అందరికీ వర్తిస్తుందని సవరణలను ప్రతిపాదించింది. కానీ, ఈ సవరణలకు న్యాయ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఈ బిల్లు ముసాయిదాపై మరింత స్పష్టత అవసరమని భావించిన కేంద్ర హోంశాఖ చర్చను వాయిదా వేసింది.

English summary

 Woman molested in New Delhi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X