వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిన్ లాడెన్ అల్లుడు అబు అరెస్ట్, అమెరికా తరలింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Osama bin Laden's son-in-law arrested, brought to US
వాషింగ్టన్: అల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ అల్లుడు సులేమన్ అబూ గేత్‌ను అమెరికా ఫెడరల్ అధికారులు అరెస్టు చేశారు. లాడెన్ అల్లుడు సులేమన్‌ను తాము జోర్డాన్‌లో అరెస్టు చేసినట్లు వారు వెల్లడించారు. తీవ్రవాదంపై పోరులో సులేమన్ అరెస్టు కీలక పరిణామమని వారు అన్నారు.

ఇతనిని న్యూయార్క్ కోర్టు ముందు ఈ రోజు ప్రవేశ పెడతామని అటార్నీ జనరల్ హెరిక్ హోల్డర్ తెలిపారు. అమెరికా పౌరులను చంపిన కేసులో సులేమన్ అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. అల్ ఖైదా మీడియా ప్రతినిధిగా సులేమన్ పని చేశాడు. అతను బిన్ లాడెన్ కూతురు ఫాతిమాను పెళ్లి చేసుకున్నారు.

9/11 దాడుల అనంతరం అతను అమెరికాకు హెచ్చరికలు జారీ చేశాడు. అతను అప్పుడు అల్ జజీరా ఛానల్‌లో ఈ హెచ్చరిక ప్రకటనలు చేశాడు. సులేమన్ కువైట్‌లో జన్మించాడు. జోర్డాన్‌లో గురువారం పట్టుబడ్డ ఇతనిని శుక్రవారం కోర్టులో హాజరుపర్చనున్నారు.

కాగా, అగ్రరాజ్యాలను అల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ వణికించిన విషయం తెలిసిందే. అతను రెండేళ్ల క్రితం 2011 మే 2వ తేదిన చంపబడిన విషయం తెలిసిందే. అతను పాకిస్తాన్‌లోని అబొత్తాబాద్‌లో అమెరికా బలగాల చేతిలో మృతి చెందాడు. ఆయనను కిల్లింగ్ ఆపరేషన్‌ను అమెరికా అధ్యక్షుడు ఒబామా సాంకేతిక సాధనాల ద్వారా వీక్షించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.

English summary
Sulaiman Abu Ghaith, the son-in-law of Osama bin Laden and his once spokesman has been captured and brought to the US, a top federal official has said. Ghaith, whose arrest is said to be a major milestone in the war against terrorism, is scheduled to be produced before a New York court on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X