వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాళ్ల బేరమే కడప పౌరుషమా?: విజయమ్మకు ఎర్రబెల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Errabelli Dayakar Rao
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీతో కాళ్ల బేరానికి రావడమే కడప పౌరుషమా? అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు సోమవారం ప్రశ్నించారు. ఓ ఆంగ్ల దిన పత్రికకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ఇచ్చి ఇంటర్వ్యూ దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఎర్రబెల్లి స్పందించారు. జగన్‌ను బయటకు తెచ్చుకునేందుకే ఈ ఆఫర్‌లు అని ఆరోపించారు.

తన భర్త వైయస్ రాజశేఖర రెడ్డి మృతి కుట్ర అని చెప్పిన వైయస్ విజయమ్మ ఇప్పుడు దానిని గాలికి వదిలేశారా అని ప్రశ్నించారు. వైయస్ మరణం వెనుక కాంగ్రెస్ పెద్దల కుట్ర ఉందని ఉప ఎన్నికల ప్రచారంలో విజయమ్మతో పాటు షర్మిల ఊరూరా చెప్పారని, ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారని, వైయస్ మరణం కుట్ర గాలికి పోయిందా అన్నారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిలు కోసం ఆయన పార్టీ పడరాని పాట్లు పడుతోందన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ కూడా సిబిఐకి సహకరించకుండా తెర వెనుక ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెసు అసలు గుట్టు ఇప్పుడు బయట పడిందని, ఎప్పటికైనా పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్‌లో కలవడం ఖాయమని ఎర్రబెల్లి దయాకర రావు జోస్యం చెప్పారు.

అవిశ్వాసానికి మద్దతు

ప్రభుత్వంపై ఏపార్టీ అవిశ్వాసం ప్రవేశపెట్టినా టీడీపీ మద్దతిస్తుందని మాజీమంత్రి కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. వైసీపీకి ధైర్యముంటే అవిశ్వాస తీర్మానం పెట్టాలని సవాలు చేశారు. వాళ్లు పెడితే మద్దతిచ్చి ప్రభుత్వాన్ని కూలదోసేందుకు తాము సహకరిస్తామన్నారు. కాంగ్రెస్, వైసీపీ కుమ్మక్కు కావటం వల్లే జగన్ చంచల్‌గూడ జైలును పార్టీ కార్యాలయంగా మార్చుకొని అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలను నడుపుతున్నారని ఆరోపించారు.

English summary
Telugudesam Party senior MLA and Telangan TDP forum convenor Errabelli Dayakar Rao has questioned YSR Congress Party honorary president YS Vijayamma on her interview.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X