కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ సిఎం అవుతాడన్న సోదరుడు: అవిశ్వాసానికి సై

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Avinash Reddy
కడప: తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, జగన్ సోదరుడు వైయస్ అవినాష్ రెడ్డి మంగళవారం అన్నారు. కడప జిల్లాలోని ఇడుపులపాయలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైయస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. జెండాను ఆవిష్కరించిన అతను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలుపు ఖాయమన్నారు. జగన్‌కు ప్రజల్లో మంచి ఆదరణ ఉందన్నారు. ఆయన ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. 2014లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను మేమే గెలుచుకుంటామని చెప్పారు.

కడప జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కన్వీనర్ జెండా ఎగురవేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజా సమస్యల పైన నిత్యం వైయస్సార్ కాంగ్రసు పార్టీయే పోరాటం చేస్తోందన్నారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని, గెలుపు కూడా తమదేనని ధీమా వ్యక్తం చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత ఆయన హయాంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తుత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నీరుగారుస్తోందని మండిపడ్డారు.

అవిశ్వాసానికి మద్దతు

ప్రజా సమస్యలపై ఏ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినా తమ పార్టీ మద్దతిస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి వేరుగా హైదరాబాదులో చెప్పారు.

English summary
YSR Congress Party leader YS Avinash Reddy said on Tues day that party chief and Kadapa MP YS Jaganmohan Reddy will become chief minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X