గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దుస్థితి: గుంటూరు ఆస్పత్రిలో రోగిని కొరికిన ఎలుకలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rats
గుంటూరు: ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి ఎలా ఉందో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి తీరు చూస్తే అర్థమవుతుంది. ఈ ఆస్పత్రిలో ఎలుకలు రోగులను కొరుకుతున్నాయి. రోగుల శరీర భాగాలను ఎలుకలు కొరుక్కు తింటుండడంతో భయ బ్రాంతులకు గురవుతున్నారు. దుర్గి మండలం ఆత్మకూరుకు చెందిన పుంగా పూర్ణమ్మ శరీరం చచ్చుబడి పోవడంతో నెలరోజులుగా ప్రభుత్వ ఆస్పత్రిలోని న్యూరాలజీ విభాగంలో చికిత్స పొందుతోంది. వారం రోజుల క్రితం ఒకసారి ఈమె కాళ్లలో కొంత భాగం ఎలుకలు తిన్నాయి. దీన్ని గమనించిన రోగి బంధువులు సంబంధిత వైద్యులకు, అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవ్వరూ స్పందించలేదు.

తాజాగా సోమవారం మరోసారి ఎలుకలు పూర్ణమ్మ కుడి, ఎడమ అరికాళ్లను రక్తం వచ్చేలా రక్కాయి. కొంత భాగాన్ని తినేశాయి. దీన్ని గమనించిన బంధువులు మరోసారి అధికారులకు, వైద్యులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై స్పందించాల్సిన అధికారులు తిరిగి రోగి బంధువులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాగ్రత్తగా లేకుండా ఏం చేస్తున్నారని ఎదురు ప్రశ్నించారు. దీంతో బాధితులు ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సూపరింటెండెంట్ చల్లా మోహనరావును వివరణ కోరగా స్పందించలేదు.

అయితే, చివరకు మోహనరావు వైద్యులను అప్రమత్తం చేశారు. వార్డును సందర్శించి పారిశుధ్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలిని పరీక్షించి, తగిన చికిత్స అందించాలని ఆయన వైద్యులను ఆదేశించారు. రోగి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

వార్డును శుభ్రంగా ఉంచనందుకు పారామెడికల్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటానని చల్లా మోహనరావు హామీ ఇచ్చారు. సరైన నిధులు విడుదల చేయడం లేదని వైద్యులు, నర్సులు ఆస్పత్రి అధికార యంత్రాంగంపై మండి పడుతున్నారు. అవసరం లేని చోటు డబ్బులు ఖర్చు చేస్తూ, అవసరం ఉన్న చోట పెట్టడం లేదని వారంటున్నారు.

గతంలోనూ ఇలాగే జరిగింది...

గతంలోనూ ఇదే తరహా సంఘటనలు జీజీహెచ్‌లో చోటు చేసుకున్నాయి. అప్పట్లో వీటిపై బాధితులు సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఎలుకల నివారణకు ఏం చేయాలంటూ ఇంజనీరింగ్ అధికారులను వివరణ కోరారు. అయితే ఇంజనీరింగ్ అధికారులు ఎలుకల నివారణకు రూ. 7 కోట్లు ఖర్చవుతాయంటూ ప్రతిపాదనలు పెట్టారు. దీంతో సూపరింటెండెంట్ ఆ ప్రతిపాదనలు పక్కన పెట్టారని వార్తలు వచ్చాయి.

English summary
In a stunning exposure of pathetic conditions prevailing at the Government General Hospital (GGH) here, rats bit a patient in the neurology wing here on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X